బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

గంగా ఎక్స్‌ప్రెస్‌వే జాతికి అంకితం… యూపీ అభివృద్ధికి కొత్త దారులు: మోదీ

గంగా ఎక్స్‌ప్రెస్‌వే జాతికి అంకితం… యూపీ అభివృద్ధికి కొత్త దారులు: మోదీ

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న గంగా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. సుమారు రూ.36,230 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భారీ ప్రాజెక్టును హర్దోయ్‌లో జరిగిన సభలో ప్రారంభించారు. గంగా పరివాహక ప్రాంతాల గుండా సాగిన ఈ ఎక్స్‌ప్రెస్‌వే రాష్ట్రంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచనుంది. వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్య రంగాల్లో వేగవంతమైన అభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని అధికారులు తెలిపారు.ప్రారంభోత్సవ సభలో మాట్లాడిన ప్రధాని, గంగామాత దేశానికి జీవనాడిలా ఉన్నట్లే ఈ ఎక్స్‌ప్రెస్‌వే కూడా రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా మారుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టు భారతీయ వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.ఈ ఎక్స్‌ప్రెస్‌వే వల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ప్రయాగ్‌రాజ్ సంగమం, వారణాసి కాశీ విశ్వనాథ్ ఆలయానికి చేరుకోవడం సులభమవుతుందని వివరించారు. దీంతో భక్తులు, పర్యాటకులకు సౌకర్యం కలగనుంది.నిర్మాణ దశలో వేలాది మందికి ఉపాధి కల్పించిన ఈ ప్రాజెక్టు, భవిష్యత్తులో రవాణా, లాజిస్టిక్స్, పర్యాటక రంగాల్లో మరిన్ని ఉద్యోగ అవకాశాలను సృష్టించే అవకాశముంది.మౌలిక వసతుల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో గంగా ఎక్స్‌ప్రెస్‌వే వంటి ప్రాజెక్టులు దేశ అభివృద్ధికి వేగం తీసుకురానున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ