బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

బెంగళూరులో విషాదం.. గోడ కూలి 7 మంది మృతి

బెంగళూరులో విషాదం.. గోడ కూలి 7 మంది మృతి

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): బెంగళూరు నగరంలో భారీ వర్షాల మధ్య ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కమర్షియల్ స్ట్రీట్ ప్రాంతంలో పాత ప్రహరీ గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో కేరళకు చెందిన ఇద్దరు పర్యాటకులు, ఒక చిన్నారి, నలుగురు వీధి వ్యాపారులు ఉన్నారు.బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో భయాందోళనకు గురైన ప్రజలు రక్షణ కోసం గోడ కింద నిలుచుకోగా, అది అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో పలువురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అత్యవసర సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ఈ ఘటనపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో పరామర్శించి, ఘటనపై పూర్తి నివేదిక కోరారు.ప్రమాదానికి కూలిన గోడ వందేళ్లకు పైగా పాతదిగా గుర్తించారు. నిర్వహణ లోపాలు కారణమా అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. నగరంలోని పాత నిర్మాణాల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ