బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఎంజేపీ బీసీ గురుకులాల సత్తా

ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఎంజేపీ బీసీ గురుకులాల సత్తా

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి (SSC) ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఈసారి మొత్తం 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు మరోసారి పైచేయి సాధించగా, బాలురు 82.68%, బాలికలు 87.90% ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఫలితాలు మెరుగుపడి 78.39% ఉత్తీర్ణత నమోదైంది.ఈ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకులాలు (ఎంజేపీ) గురుకులాలు అద్భుత ప్రదర్శనతో ప్రత్యేక గుర్తింపు పొందాయి. మొత్తం 96.02% ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో రెండో స్థానం దక్కించుకున్నాయి.100 పాఠశాలల్లో 30 పాఠశాలలు 100% ఫలితాలు సాధించడం విశేషం. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు అధికంగా చదివే ఈ గురుకులాల్లో ఇలాంటి ఫలితాలు రావడం విద్యా రంగానికి మంచి సంకేతంగా భావిస్తున్నారు. వ్యక్తిగతంగా కూడా విద్యార్థులు మెరుగైన ప్రతిభ చూపారు. నరవాడ ఎంజేపీ పాఠశాల విద్యార్థులు 596, 593 మార్కులు సాధించి రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు.ఈ ఫలితాలపై మంత్రి సవిత ఆనందం వ్యక్తం చేస్తూ, విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విద్యా రంగంలో తీసుకుంటున్న చర్యల వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్