బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

మే 1 నుంచి జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులు

మే 1 నుంచి జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులు

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మే 1 నుంచి 10వ తేదీ లోపు అర్హులైన మీడియా ప్రతినిధులందరికీ ఈ కార్డులను జారీ చేయాలని సమాచార పౌర సంబంధాల శాఖ ఆదేశించింది.గతంలో 2022-2024 కాలానికి జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డుల గడువు ఏప్రిల్ 30తో ముగియనున్న నేపథ్యంలో, జర్నలిస్టులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మీడియా అక్రిడిటేషన్ కమిటీల సమావేశాలను ఏప్రిల్ 30లోపు పూర్తి చేయాలని స్పెషల్ కమిషనర్ అధికారులకు సూచించారు. కమిటీ ఆమోదం పొందిన అర్హులైన జర్నలిస్టులకు నిర్ణీత గడువులో కార్డులు అందజేయాలని తెలిపారు.ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పౌర సంబంధాల అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు.ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది జర్నలిస్టులకు లబ్ధి చేకూరనుంది. అర్హత ప్రమాణాలను కచ్చితంగా అమలు చేస్తూ, పారదర్శకంగా కార్డుల జారీ జరుగుతుందని అధికారులు వెల్లడించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి