బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

రుణమాఫీపై హైకోర్టులో హరీశ్‌రావు పిటిషన్

రుణమాఫీపై హైకోర్టులో హరీశ్‌రావు పిటిషన్

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో రైతుల రుణమాఫీ అమలు వివాదం న్యాయస్థానానికి చేరింది. అర్హులైన రైతులకు రుణమాఫీ పూర్తిగా అమలు కావడం లేదని ఆరోపిస్తూ మాజీ మంత్రి హరీశ్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.సిద్ధిపేట నియోజకవర్గానికి చెందిన సుమారు 23 వేల మంది రైతులు రుణమాఫీ ప్రయోజనం పొందలేదని ఆయన తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ప్రభుత్వ జీవో అమలులో లోపాల వల్ల అర్హులైన రైతులు నష్టపోతున్నారని, దీంతో వారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.రైతుల సమస్యను దృష్టిలో ఉంచుకుని తక్షణ పరిష్కారం కోసం కోర్టు జోక్యం అవసరమని హరీశ్‌రావు తరఫు న్యాయవాది విన్నవించారు. అయితే ప్రభుత్వ తరఫు న్యాయవాది ఈ అంశం ప్రజాప్రయోజనానికి సంబంధించినదని, పిటిషన్‌ను ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL)గా దాఖలు చేయాలని సూచించారు.ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇది వ్యక్తిగత సమస్య కాదని, ప్రజల సమస్య కాబట్టి PIL రూపంలో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.దీంతో కోర్టు సూచన మేరకు హరీశ్‌రావు తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. త్వరలోనే ఈ అంశంపై కొత్తగా పిల్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి