బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ప్రైవేట్ బస్సులపై కట్టుదిట్టం.. 80 కి.మీ వేగానికి మించి నో

ప్రైవేట్ బస్సులపై కట్టుదిట్టం.. 80 కి.మీ వేగానికి మించి నో

మే 01, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఇటీవల జరిగిన వరుస ప్రమాదాల నేపథ్యంలో ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రవాణా శాఖ అధికారులు జీపీఎస్ ఆధారిత పర్యవేక్షణను ప్రారంభించారు. ఇకపై బస్సులు గంటకు 80 కిలోమీటర్లకు మించిన వేగంతో ప్రయాణించకూడదని స్పష్టం చేశారుఆలిండియా టూరిస్ట్ పర్మిట్ కింద నడిచే బస్సులపై ప్రత్యేక నిఘా పెట్టారు. రాష్ట్రంలో ఉన్న బస్సుల్లో ఎక్కువ భాగానికి ఇప్పటికే జీపీఎస్ పరికరాలు అమర్చగా, మిగిలిన వాటికీ త్వరలో అమలు చేయనున్నారు.కంట్రోల్ రూమ్ నుంచి బస్సుల ప్రయాణాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ, వేగ పరిమితి దాటితే వెంటనే అలర్ట్ అందే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన బస్సులను సీజ్ చేసి, ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లలో తనిఖీలు చేస్తున్నారు.ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నిబంధనలు పాటించని ట్రావెల్స్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్