బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల ప్రతిభకే ప్రాధాన్యం.. విద్యా రంగంలో లోకేశ్ కొత్త విధానం

విద్యార్థుల ప్రతిభకే ప్రాధాన్యం.. విద్యా రంగంలో లోకేశ్ కొత్త విధానం

మే 01, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు మంత్రి నారా లోకేశ్. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇటీవల పదో తరగతి ఫలితాల్లో మెరుగైన మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల వివరాలతో పత్రికల్లో ప్రత్యేక ప్రకటనలు ఇవ్వడం చర్చనీయాంశమైంది. సాధారణంగా రాజకీయ నాయకుల ఫోటోలు, నినాదాలతో ఉండే ప్రకటనలకు భిన్నంగా ఈసారి పూర్తిగా విద్యార్థుల ప్రతిభనే ప్రాధాన్యంగా చూపించారు.ఈ ప్రకటనల్లో ముఖ్యమంత్రి లేదా మంత్రుల చిత్రాలు లేకుండా, విద్యార్థుల ఫోటోలు, పేర్లు, వారు చదివిన పాఠశాలల వివరాలను ప్రదర్శించడం ప్రత్యేకతగా నిలిచింది. విద్యార్థుల కృషిని గుర్తించి గౌరవించడం ద్వారా వారికి ప్రోత్సాహం కల్పించడమే లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ విధానం ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతుందని, ప్రైవేట్ పాఠశాలలకు సమానంగా పోటీ చేసే స్థాయికి తీసుకెళ్తుందని విద్యావేత్తలు భావిస్తున్నారు.విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు ఇవ్వడం ద్వారా వారికి ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా, ఇతరులకు కూడా ఇది ప్రేరణగా మారనుంది. రాజకీయాలకు అతీతంగా విద్యా అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వ నిర్ణయం ప్రశంసలు అందుకుంటోంది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్