బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఓఆర్‌ఆర్ ప్రమాదం విషాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి, ఉస్మానియాలో బాధితులను పరామర్శించిన కేటీఆర్

ఓఆర్‌ఆర్ ప్రమాదం విషాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి, ఉస్మానియాలో బాధితులను పరామర్శించిన కేటీఆర్

మే 02, (నేటి తెలుగు పత్రిక): శంషాబాద్‌ ఔటర్ రింగ్ రోడ్‌పై చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని పూర్తిగా కుదిపేసింది. సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రామ్మోహన్ సోదరుడి కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.ప్రమాదం అనంతరం మృతదేహాలను అంబులెన్స్‌లలో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఉదయం ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. తీవ్ర ఆవేదనలో ఉన్న కుటుంబీకులను ఓదార్చుతూ వారికి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా ఒక మహిళ “మా వంశం మొత్తం చనిపోయింది” అంటూ విలపించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు చూసిన ప్రతి ఒక్కరూ తీవ్రంగా కలత చెందారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఈ ప్రమాదం మానవ తప్పిదమా, అతివేగమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రోడ్డు భద్రతపై మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి