బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఆర్టీసీ సిబ్బందితో స్నేహపూర్వకంగా ఉండండి: మంత్రి పొన్నం ప్రభాకర్

ఆర్టీసీ సిబ్బందితో స్నేహపూర్వకంగా ఉండండి: మంత్రి పొన్నం ప్రభాకర్

మే 02, (నేటి తెలుగు పత్రిక): ఆర్టీసీ అధికారులు కిందిస్థాయి సిబ్బంది, ప్రయాణికులతో సానుకూలంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిబ్బందిని వేధింపులకు గురిచేయకుండా ప్రేమతో పనులు చేయించుకోవాలని డివిజన్ స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో జరిగిన సమావేశంలో కార్మిక సంఘాలు లేవనెత్తిన అంశాలపై జూమ్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి, పలు కీలక సూచనలు చేశారు. డ్రైవర్లు, కండక్టర్లు సహా సిబ్బందితో దురుసుగా కాకుండా స్నేహపూర్వకంగా ఉండాలని, ప్రయాణికులతో మంచి సంబంధాలు కొనసాగించాలని స్పష్టం చేశారు. మే 17లోగా డిపోలు, బస్ స్టేషన్లలో టాయిలెట్లు, తాగునీరు, పరిశుభ్రత, మొక్కల నాటడం వంటి మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని ఆదేశించారు. కొన్ని డిపోలు నష్టాల్లో నడవడానికి గల కారణాలను సమీక్షించి చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.టికెట్ల విషయంలో సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని, సిబ్బంది మధ్య అంతర్గత విభేదాలు ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రతి రెండో మంగళవారం సిబ్బంది సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.ఆర్టీసీ అభివృద్ధి కోసం మంత్రి నుంచి సిబ్బంది వరకు అందరూ కలిసి పనిచేయాలని, కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి