బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

కారంపూడి దోపిడీ కేసు ఛేదన… ఆరుగురు అరెస్ట్

కారంపూడి దోపిడీ కేసు ఛేదన… ఆరుగురు అరెస్ట్

మే 04, (నేటి తెలుగు పత్రిక): పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన కారంపూడి బంగారం దోపిడీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. పట్టపగలు వ్యాపారిపై దాడి చేసి సుమారు రూ.60 లక్షల విలువైన ఆభరణాలు దోచుకున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు మీడియాకు వివరాలు వెల్లడిస్తూ.. ఈ కేసులో ఆరుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారి వద్ద నుంచి అపహరించిన బంగారం, అలాగే నేరానికి ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.వినుకొండకు చెందిన బంగారం వ్యాపారి యక్కల శ్రీనివాసరావుపై ఈ దాడి జరిగింది. విచారణలో స్థానిక జ్యువెలరీ దుకాణంలో పనిచేసే గోసుల శంబయ్య ఈ దోపిడీకి ప్రధాన సూత్రధారి అని పోలీసులు గుర్తించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో అతడు ఈ కుట్ర పన్నినట్లు తెలిపారు.ప్రతి సోమవారం వ్యాపారి బంగారంతో కారంపూడికి వస్తారని ముందుగానే గమనించి, తన స్నేహితులతో కలిసి పక్కా ప్రణాళిక రూపొందించి దాడి చేసినట్లు వెల్లడించారు.సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యేక బృందాల సమన్వయంతో కేసును త్వరగా ఛేదించగలిగామని చెప్పారు.పట్టపగలు జరిగిన ఈ భారీ దోపిడీ కేసు పరిష్కారం కావడంతో స్థానిక ప్రజల్లో ఉపశమనం నెలకొంది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్