బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

బెంగాల్‌లో బీజేపీ విజయం చారిత్రాత్మకం: కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

బెంగాల్‌లో బీజేపీ విజయం చారిత్రాత్మకం: కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

మే 04, (నేటి తెలుగు పత్రిక): వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ సాధించిన విజయాన్ని చారిత్రాత్మకంగా అభివర్ణించారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవడం, బెంగాల్‌లో భారీ విజయం సాధించడం పార్టీకి గొప్ప మైలురాయిగా పేర్కొన్నారు.విజయవాడలో పార్టీ శ్రేణులతో కలిసి సంబరాల్లో పాల్గొన్న ఆయన, కార్యకర్తలకు స్వీట్లు పంచి ఆనందం వ్యక్తం చేశారు. గతంలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పరిస్థితి నుంచి, ఇప్పుడు వందల సంఖ్యలో సీట్లు గెలుచుకోవడం బీజేపీ ఎదుగుదలకు నిదర్శనమన్నారు. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, చొరబాట్లు, హింసాత్మక ఘటనలు, కేంద్ర పథకాల దుర్వినియోగం వంటి అంశాలను ప్రస్తావించారు. అయినప్పటికీ ప్రజలు ఈసారి స్పష్టమైన తీర్పు ఇచ్చి బీజేపీకి మద్దతు పలికారని అన్నారు.ఈ విజయాన్ని శ్యామ ప్రసాద్ ముఖర్జీ కలల సాకారంగా అభివర్ణించిన ఆయన, ఆయన స్వస్థలమైన బెంగాల్‌లో బీజేపీ జెండా ఎగరవేయడం గర్వకారణమన్నారు.దేశవ్యాప్తంగా ప్రజలు అభివృద్ధి, స్థిరత్వం కోరుకుంటున్నారని, అదే బీజేపీ విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజలు నమ్మకం ఉంచారని, ఈ ఫలితాలు ఆ విశ్వాసానికి నిదర్శనమని శ్రీనివాస వర్మ తెలిపారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్