బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

మోదీ సభకు బీజేపీ జోరు ప్రచారం.. తార్నాకలో వాల్ రైటింగ్ హల్‌చల్

మోదీ సభకు బీజేపీ జోరు ప్రచారం.. తార్నాకలో వాల్ రైటింగ్ హల్‌చల్

మే 05, (నేటి తెలుగు పత్రిక): సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మే 10న జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ ప్రచారం ఉద్ధృతమైంది. ఈ క్రమంలో తార్నాకలో నిర్వహించిన వాల్ రైటింగ్ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు పాల్గొన్నారు.కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు భారీగా పాల్గొని గోడలపై మోదీ సభకు సంబంధించిన నినాదాలు, సందేశాలను రాశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహా ప్రచారాన్ని విస్తరించాలని పార్టీ పిలుపునిచ్చింది. ఈ ప్రచారం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు సభకు భారీ జనసమీకరణ లక్ష్యంగా పెట్టుకుంది.ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ మే 10న జరిగే మోదీ సభ తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు అవుతుందని అన్నారు. కార్యకర్తలు ప్రతి గ్రామం, కాలనీ వరకు ఈ సందేశాన్ని తీసుకెళ్లాలని సూచించారు. వాల్ రైటింగ్ కార్యక్రమం ప్రజల్లో చైతన్యం కలిగించే ఉద్యమంగా మారాలని ఆయన పేర్కొన్నారు.మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని, అదే అభివృద్ధిని తెలంగాణకు తీసుకురావడమే బీజేపీ లక్ష్యమని చెప్పారు. సభ ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తామని తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశముందని పార్టీ అంచనా వేస్తోంది. సభ ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. వాల్ రైటింగ్ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా సభపై ఆసక్తి పెరుగుతోందని నేతలు తెలిపారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి