బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

లోకేశ్ కృషితో ఏపీలో భారీ పెట్టుబడి

లోకేశ్ కృషితో ఏపీలో భారీ పెట్టుబడి

మే 05, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా మారుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వం, మంత్రి నారా లోకేశ్ కృషితో పరిశ్రమలు వరుసగా రాష్ట్రానికి వస్తున్నాయి.ఈ క్రమంలో అమెరికాకు చెందిన ప్రముఖ క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడికి ముందుకొచ్చింది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీ పారిశ్రామిక వాడలో కొత్త తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది.సుమారు 39 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఈ ప్లాంట్ ద్వారా దశలవారీగా రూ.1000 కోట్ల పెట్టుబడి రానుందని అంచనా. ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 3,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, వేలాది పరోక్ష ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి.ఈ యూనిట్‌లో ఆధునిక HVAC (హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్) ఉత్పత్తుల తయారీపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. అత్యాధునిక సాంకేతికతతో ప్లాంట్‌ను అభివృద్ధి చేయనున్నట్లు సంస్థ తెలిపింది.ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన కార్యక్రమాన్ని మంత్రి నారా లోకేశ్ నిర్వహించనున్నారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్