బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ప్రతి గ్రామం స్వచ్ఛతకు మారుపేరుగా నిలపాలి: జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి

ప్రతి గ్రామం స్వచ్ఛతకు మారుపేరుగా నిలపాలి: జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి

మచిలీపట్నం, మే 06,(నేటి తెలుగు పత్రిక): జిల్లాలోప్రతి గ్రామం స్వచ్ఛతకు మారుపేరుగా నిలిపేందుకు క్షేత్రస్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని డిపిఓ ధనలక్ష్మి పిలుపునిచ్చారు “స్వచ్ఛ పదం”కార్యక్రమo జిల్లా పంచాయతీ అధికారిణి ధనలక్ష్మి వేకువజామున మచిలీపట్నం పరిధిలోని పోతేపల్లి గ్రామంలో ప్రారంభించారు .ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాలు, మండలప్రధాన కేంద్రాలు, హైవేల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు.ప్రత్యేకంగా మండలం నుంచి వెళ్లే కనెక్టివిటీ రోడ్లు, ప్రతి పల్లెలోని ప్రధాన రహదారులు, హైవేలకు అనుసంధాన మార్గాలు శుభ్రంగాఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామం స్వచ్ఛతకు మారుపేరుగా నిలవాలని, పరిశుభ్రమైన వాతావరణం ప్రజల ఆరోగ్యానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు.ప్రతి బుధవారం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకుని “స్వచ్ఛ పదం” కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు సమన్వయంతో పనిచేసి పరిశుభ్రతను ప్రజా ఉద్యమంగా మార్చాలని పిలుపునిచ్చారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్