బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

వైసీపీపై మంత్రి డీబీవీ స్వామి విమర్శలు.. రాజకీయ విలువలు లేవని ఆరోపణ

వైసీపీపై మంత్రి డీబీవీ స్వామి విమర్శలు.. రాజకీయ విలువలు లేవని ఆరోపణ

ప్రకాశం, మే 06, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల్లో విలువలు లేని పార్టీ వైసీపీ అని ఎద్దేవా చేశారు.ఒంగోలులో టీడీపీ పార్లమెంట్ నూతన భవనానికి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వేసిన పునాదులతో టీడీపీ 44 ఏళ్లుగా బలంగా నిలబడిందని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారని పేర్కొన్నారు.ప్రజాసంక్షేమం, సామాజిక న్యాయం కోసం టీడీపీ కట్టుబడి పనిచేస్తోందని మంత్రి తెలిపారు. టీడీపీ ఆవిర్భావంతో సమాజంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి కాకుండానే జాతికి అంకితం చేశామని చెప్పి ప్రజలను జగన్ మోహన్ రెడ్డి మోసం చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని వైసీపీ నేతలే ఒప్పుకున్నారని మంత్రి డీబీవీ స్వామి పేర్కొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్