Breaking News

ఐకెపి కేంద్రాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

చేస్తూ మే 11న జరిగే కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయండి.
సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

రైల్ రోకో కేసులో కల్వకుంట్ల కవితకు సికింద్రాబాద్ రైల్వే కోర్టు సమన్లు

సూర్యాపేట, మే 06, (నేటి తెలుగు పత్రిక): ఐకెపి కేంద్రాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మే 11న సూర్యాపేట కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాకు రైతాంగం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గం సమావేశంలో ఆయన మాట్లాడుతూఐకెపి కేంద్రాలకు వరి ధాన్యం వచ్చి రోజులు గడుస్తున్న నేటికీ30 శాతం ధాన్యానికి కాంటాలు వేయకపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఐకెపి కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి లిఫ్ట్ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐకెపి కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కాంటాలు వేయాలన్నారు. లారీల కొరత మూలంగా కాంటాలు వేసిన ధాన్యం లిఫ్టు చేయకపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తరుగు పేరుతో రెండు, మూడు కిలోలు తరుగు తీస్తున్నారని అన్నారు. మిల్లు యాజమాన్యులు దిగుమతి చేసుకునే దగ్గర సమస్యలు సమస్యలు సృష్టించి రైతాంగాన్ని నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు.ఐకెపి కేంద్రాలు గాలిలో దీపాలుగా ఉన్నాయన్నారు. ఐకెపి కేంద్రాల సరిపడా గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచాలన్నారు. రైతాంగం ఆరుగాలం పండించిన పంట ఐకెపి కేంద్రాలకు వస్తే మద్దతు ధర కరువైతుందన్నారు. తేమ, బెరుకులు సాకుతో రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరి ధాన్యం కాంటా వేసే సందర్భంగా తూకాలలో జరుగుతున్న మోసాలను అరికట్టాలన్నారు. అకాల వర్షాలు వచ్చే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం తక్షణమే కొనుగోలును వేగవంతం చేయాలన్నారు. లేకపోతే అకాల వర్షాలు వస్తే మొత్తం రైతులు తీవ్రంగా పంట నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐకెపిలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం సోమవారం తలపెట్టిన ధర్నాకు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగారపు పాండు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి పాల్గొన్నారు.

పని మనుషుల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి: హైదరాబాద్ పోలీసులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *