బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధిని అడ్డుకుంటే కఠిన చర్యలు – మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరిక

అభివృద్ధిని అడ్డుకుంటే కఠిన చర్యలు – మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరిక

మే 06, (నేటి తెలుగు పత్రిక): కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అభివృద్ధి పనులపై మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఎవరైనా అడ్డుకుంటే కఠినంగా ఎదుర్కొంటామని అన్నారు.ఈ సందర్భంగా తాగునీటి పైపులైన్లు, రహదారి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి, మచిలీపట్నంలోని ప్రతి ప్రాంతానికి మౌలిక వసతులు అందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. ముఖ్యంగా తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రూ.28 లక్షల వ్యయంతో ప్రారంభమైన పనులు త్వరలో పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడేలా చేస్తామని చెప్పారు.గత ఐదేళ్లలో పట్టణ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని వైసీపీపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రోడ్లు కూడా సరిగా లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంతలు లేని రోడ్లతో మచిలీపట్నాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని వివరించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిధులు సమకూర్చుకుని అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. గతంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించకుండా వదిలేయడం వల్ల అవి పాడైపోయాయని ఆరోపించారు. పేదల భూముల విషయంలో కూడా అక్రమాలు జరిగాయని ఆయన వ్యాఖ్యానించారు.మాజీ మంత్రి పేర్ని నాని చేసిన ఆరోపణలను ఖండిస్తూ, ఆధారాలు లేకుండా మాట్లాడడం సరికాదన్నారు. అభివృద్ధి పనులపై అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తే ప్రభుత్వం సహించదని, ప్రజల ప్రయోజనాల కోసం ముందుకు సాగుతామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్