Breaking News

“సి. జోసెఫ్ విజయ్ అనబడే నేను..” తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణం

మే 10, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు రాజకీయాల్లో చారిత్రక పరిణామం చోటుచేసుకుంది. సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత సి. జోసెఫ్ విజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్రావిడ రాజకీయాలకు భిన్నంగా ప్రజల తీర్పుతో అధికారంలోకి వచ్చిన విజయ్ ప్రమాణ స్వీకారం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.చెన్నై జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం ఉదయం జరిగిన ఘన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ విజయ్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. వేలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు, సినీ ప్రముఖులు, రాజకీయ నేతల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం తమిళనాడు రాజకీయ చరిత్రలో ప్రత్యేక ఘట్టంగా నిలిచింది.“సి. జోసెఫ్ విజయ్ అనబడే నేను…” అంటూ విజయ్ చేసిన ప్రమాణ స్వీకారం సభలో భావోద్వేగ వాతావరణాన్ని సృష్టించింది. అభిమానుల కేరింతలు, నినాదాలతో స్టేడియం మార్మోగిపోయింది. దాదాపు 59 ఏళ్ల తర్వాత తమిళనాడులో ద్రావిడేతర నాయకుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం విశేషంగా మారింది. ఇప్పటివరకు డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల ఆధిపత్యంలో కొనసాగిన రాష్ట్ర రాజకీయాల్లో విజయ్ ప్రవేశం భారీ మార్పుకు సంకేతంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన ప్రధాని మోదీ

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, సీనియర్ నేత తమిళిసై సౌందరరాజన్ హాజరుకావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు కూడా కార్యక్రమంలో పాల్గొని విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.విజయ్ తల్లిదండ్రులు ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన కుమారుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తుండటాన్ని వారు భావోద్వేగంతో వీక్షించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ సంచలన విజయం సాధించింది. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ వంటి మిత్రపక్షాల మద్దతుతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు.యువతకు ఉద్యోగాలు, అవినీతి నిర్మూలన, విద్యా సంస్కరణలు, సంక్షేమ పథకాల అమలు వంటి హామీలతో ప్రజల్లోకి వెళ్లిన విజయ్‌కు భారీ మద్దతు లభించింది. ముఖ్యంగా యువత, మధ్యతరగతి, సినీ అభిమానులు టీవీకే విజయానికి ప్రధాన బలంగా నిలిచారు.కొత్త తరహా రాజకీయాలు, యువ నాయకత్వం, నిపుణులకు ప్రాధాన్యం అనే అంశాలతో విజయ్ ప్రభుత్వం తమిళనాడులో కొత్త రాజకీయ సంస్కృతికి నాంది పలికిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

విజయ్ కేబినెట్‌లో యువతకు పెద్దపీట.. 29 ఏళ్ల కీర్తనకు మంత్రి పదవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *