బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యావారోత్సవాలు ప్రారంభం

నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యావారోత్సవాలు ప్రారంభం

మే 11, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం నేటి నుంచి విద్యావారోత్సవాలను నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో అధికారికంగా ప్రారంభించనున్నారు.ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగే విద్యావారోత్సవాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు భాగస్వామ్యం కానున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల, మౌలిక వసతుల అభివృద్ధి, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ప్రజల్లో అవగాహన పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, డిజిటల్ విద్య, ఆధునిక తరగతి గదులు, పరిశుభ్రమైన వసతులు, మధ్యాహ్న భోజన పథకం, విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు. విద్యావారోత్సవాల సందర్భంగా పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, విద్యా చర్చలు, తల్లిదండ్రుల సమావేశాలు, విద్యార్థుల ప్రతిభా ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెంచడం, విద్యార్థుల నమోదు శాతం పెంచడం కూడా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా అధికారులు తెలిపారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి