Breaking News

పార్టీ పనుల్లోకి మళ్లీ పవన్ కల్యాణ్.. జనసేనలో కీలక సమావేశాలు

మే 11, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కొద్దిరోజుల విశ్రాంతి అనంతరం మళ్లీ పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించారు. ఇటీవల సైనస్ శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆరోగ్యం మెరుగుపడడంతో తిరిగి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం పవన్ కల్యాణ్ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.ముఖ్యంగా మంగళవారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరగనున్న జనసేన వివిధ కమిటీల సమావేశానికి సంబంధించిన అంశాలపై పవన్ దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. పార్టీ రాష్ట్ర కమిటీలు, అనుబంధ విభాగాల నియామకాలపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా జనసేన నేతల్లో ఉత్కంఠ నెలకొంది.ఇటీవల ఎన్నికల అనంతరం ప్రభుత్వ బాధ్యతలు, అధికార కార్యక్రమాలతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ ఆరోగ్య సమస్యల కారణంగా కొంతకాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ పార్టీ పనుల్లో చురుకుగా పాల్గొనబోతుండటంతో జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.ఇదిలా ఉండగా, ఆదివారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లి పరామర్శించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ప్రధాని, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించినట్లు సమాచారం. “ప్రజా జీవితంలో ఉన్నవారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకా ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత మీపై ఉంది” అని మోదీ పవన్‌కు సూచించినట్లు తెలుస్తోంది.ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి వైరల్‌గా మారాయి. జనసేన కార్యకర్తలు, అభిమానులు పవన్ త్వరగా కోలుకుని మళ్లీ పూర్తి స్థాయిలో రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నారు.

సంజీవ‌ని ప‌థ‌కంతో పేద‌ల‌కు మ‌రింత మెరుగైన వైద్యం: మంత్రి కొల్లు ర‌వీంద్ర

కూటమి ప్రభుత్వం శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి: హోం మంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *