Breaking News

సంజీవ‌ని ప‌థ‌కంతో పేద‌ల‌కు మ‌రింత మెరుగైన వైద్యం: మంత్రి కొల్లు ర‌వీంద్ర

విజ‌య‌వాడ‌. మే 11 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: అంత‌ర్జాతీయ స్థాయి వైద్య సేవ‌ల‌కు పొరుగు రాష్ట్రాల‌కు వెళ్ల‌న‌వ‌స‌రం లేకుండా విజ‌య‌వాడ న‌గ‌రంలోనే హైటెక్‌ టెక్నా ల‌జీతో దంత వైద్య సేవ‌ లు అందించ‌డం అభినం ద‌నీయ‌మ‌ని రాష్ట్ర ఎక్సై జ్ శాఖా మంత్రి కొల్లు ర‌వీంద్ర, అన్నారు. స్థానిక గాయ‌త్రీన‌గ‌ర్‌లోని ఎస్‌బీ ఐ ఎన్నారై కార్యాల‌యం భ‌వ‌నంలో అధునాతన సౌక‌ర్యాల‌తో నూత‌నంగా ఏర్పాటు చేసిన దుహిత దంత వైద్య‌శాల‌ను ఆదివారం ఉద‌యం మంత్రి కొల్లు ర‌వీంద్ర, ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంత‌రం మంత్రి కొల్లు ర‌వీంద్ర, మీడియాతో మాట్లాడుతూ, కూట‌మి ప్ర‌భుత్వంలో రాష్ట్ర సీఎం చంద్ర‌బాబు నాయుడు, నాయ‌క‌త్వంలో వైద్యానికి పెద్ద‌పీట వేస్తున్నామ‌న్నా రు. అంద‌రికీ ఆధునిక వైద్య‌సేవ‌లు అందించ‌డం లో దుహిత దంత వైద్య శాల ఎంతో ముందుంద‌ని తెలిపారు. గ‌త 30 ఏళ్ళు గా డాక్ట‌ర్ న‌ల్లూరి శ‌శిధ‌ర్, అన్ని వ‌ర్గాల వారికి ఆధు నిక వైద్యాన్ని అందుబా టులోకి తీసుకురావ‌డాన్ని కొనియాడుతూ ఈ సంద‌ ర్భంగా ఆసుప‌త్రి నిర్వాహ‌ కుల‌ను ప్ర‌శంసించారు. ఇదే స్ఫూర్తితో భ‌విష్య‌త్తు లో పేద‌ల‌కు మ‌రింత ఆధునిక వైద్యం అందిం చాల‌ని సూచించారు.హాస్పిట‌ల్ ఛైర్మ‌న్ డాక్ట‌ర్ న‌ల్లూరి శ‌శిధ‌ర్, మాట్లా డుతూ, గ‌డ‌చిన మూడు ద‌శాబ్ధాలుగా ఎప్ప‌టిక‌ప్పు డు మారుతున్న సాంకేతి క‌త‌ను అందిపుచ్చుకుం టూ నూత‌న వైద్య ప‌రి క‌రాల‌ను స‌మ‌కూర్చుకుం టూ దుహిత దంత వైద్య‌ శాల నేడు న‌గ‌రంలో అగ్ర‌ గామిగా రూపుదిద్దుకుంద‌ న్నారు. సువిశాల‌మైన నూత‌న ప్రాంగ‌ణంలో ఆధునిక టెక్నాల‌జీతో సూప‌ర్ స్పెష‌లిస్టుల దంత వైద్యులతో మ‌రింత మెరుగైన సేవ‌లందిస్తామ‌ ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌ మంలో తూర్పు నియోజ‌ క‌వ‌ర్గ ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్‌రావు, పోరంకి నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే బోడె ప్ర‌సాద్‌, ధ‌నేకుల ఇంజ‌నీరింగ్ కాలేజ్ ఛైర్మ‌న్ ర‌వీంద్ర‌నాధ్ ఠాగూర్‌, తెలుగుదేశం పార్టీ ఎన్‌టీ ఆర్ జిల్లా అధ్య‌క్షురాలు గ‌ద్దె అనురాధ‌, జ‌న‌సేన పార్టీ నాయ‌కులు రాజేష్, ప‌లువురు న‌గ‌ర ప్ర‌ముఖు లు పాల్గొని హాస్పిట‌ల్ నిర్వాహ‌కుల‌కు శుభా కాంక్ష‌లు తెలిపారు. న‌గ‌రంలో ప్ర‌ముఖ వైద్యు లు డాక్ట‌ర్ కొడాలి మాధ‌ వి, డాక్ట‌ర్ కొస‌రాజు చ‌ల‌ప‌తిరావు, డాక్ట‌ర్ ర‌వి కాక‌రాల‌, డాక్ట‌ర్ యార్ల‌గ‌ డ్డ ర‌మేష్‌, త‌దిత‌రులు హాజ‌రై అభినంద‌న‌లు తెలిపారు.

ఏపీ రహదారులు, రైల్వే అభివృద్ధిపై ఢిల్లీలో కీలక చర్చలు

పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం: సీఎం చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *