బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఏపీలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌కు గుడ్‌న్యూస్.. 24 గంటల్లోనే పూర్తి: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

ఏపీలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌కు గుడ్‌న్యూస్.. 24 గంటల్లోనే పూర్తి: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

మే 12, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌ను 24 గంటల్లోనే పూర్తి చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. వాహనదారులకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.డీలర్ టెంపరరీ రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత 24 గంటల్లోపు సంబంధిత అధికారులు రిజిస్ట్రేషన్‌కు ఆమోదం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. నిర్ణీత గడువులో అధికారులు స్పందించకపోతే ఆటోమేటిక్‌గా రిజిస్ట్రేషన్ ఆమోదమైనట్లుగా పరిగణించే విధానాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పారు.ఫ్యాన్సీ నంబర్ వాహనాలకు మాత్రమే ఈ విధానంలో మినహాయింపు ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. అలాగే సెలవు రోజుల్లో కూడా ఆన్‌లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ ఆమోదాలు కొనసాగుతాయని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న వాహన రిజిస్ట్రేషన్ల సమస్యకు ఈ కొత్త విధానం చెక్ పెట్టనుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సులభమైన సేవలు అందించేందుకు రవాణా శాఖ డిజిటల్ విధానాలను మరింత విస్తరిస్తోందని మంత్రి వెల్లడించారు.త్వరలోనే ఈ 24 గంటల రిజిస్ట్రేషన్ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్