Breaking News

లులు హైపర్ మార్కెట్‌లో ఫుడ్ సేఫ్టీ దాడులు.. 150 కిలోల ఆహార పదార్థాల సీజ్

మే 19, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ కూకట్‌పల్లిలోని లులు హైపర్ మార్కెట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి భారీగా నాసిరకం ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజారోగ్యానికి హానికరంగా ఉన్న సుమారు 150 కిలోల ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు.తనిఖీల సందర్భంగా పలు ఆహార పదార్థాల్లో పురుగులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే నాసిరకం పదార్థాలను నిల్వ ఉంచినట్లు తేలింది. హైపర్ మార్కెట్‌లోని కిచెన్ అపరిశుభ్రంగా ఉండటంతో పాటు పాడైపోయిన కూరగాయలు, పరిసరాల్లో పురుగులు సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.గడువు సమీపించిన ఆహార పదార్థాలపై తప్పుదారి పట్టించేలా లేబుళ్లు అతికించినట్లు కూడా బయటపడింది. గడువు ముగిసిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌తో ప్యాక్డ్ ఫుడ్ విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.హైపర్ మార్కెట్ నుంచి వెళ్లే డ్రైనేజ్ మాంసాహార వ్యర్థాలతో మూసుకుపోయినట్లు తనిఖీల్లో తేలింది. కల్తీ, అధిక కృత్రిమ రంగుల వినియోగంపై అనుమానంతో పలు ఆహార పదార్థాల నమూనాలను అధికారులు పరీక్షల కోసం సేకరించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

యశస్వినీ రెడ్డి ఫిర్యాదుపై స్పందించిన మల్లు రవి

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *