బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఖర్గేతో రేవంత్ భేటీ.. పార్టీ బలోపేతంపై కీలక చర్చలు

ఖర్గేతో రేవంత్ భేటీ.. పార్టీ బలోపేతంపై కీలక చర్చలు

జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఘన స్వాగతం పలికింది. గుల్బర్గా పర్యటనకు వెళ్తున్న సందర్భంగా హైదరాబాద్‌లో కొద్దిసేపు ఆగిన ఖర్గేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ పనితీరు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై విస్తృతంగా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరాన్ని ఖర్గే ప్రస్తావించినట్లు సమాచారం.భేటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తల సమీకరణ, జిల్లా కమిటీల పనితీరు, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న అభిప్రాయాలు, రాబోయే ఎన్నికల సన్నాహకాలపై నాయకులు తమ అభిప్రాయాలను జాతీయ అధ్యక్షుడికి వివరించినట్లు తెలుస్తోంది.ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత సమర్థంగా తీసుకెళ్లడంతో పాటు పార్టీ శ్రేణుల మధ్య సమన్వయాన్ని పెంచాలని సమావేశంలో సూచనలు వచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా నాయకత్వం సమిష్టిగా పనిచేయాలని ఖర్గే పిలుపునిచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి