బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

రైతు విద్యుత్ హక్కుల కోసం పోరాటం.. అవసరమైతే పాదయాత్ర: కవిత

రైతు విద్యుత్ హక్కుల కోసం పోరాటం.. అవసరమైతే పాదయాత్ర: కవిత

జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న రైతు విద్యుత్ పంపిణీ సంస్థపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఈ నిర్ణయం ఉంటుందని ఆరోపిస్తూ, ఉచిత విద్యుత్ కొనసాగింపు, మోటార్లకు మీటర్ల అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత, రైతు డిస్కం పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేసి ప్రస్తుతం ఉన్న ఇతర విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రైవేటీకరించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. అలాంటి ఆలోచన లేదని ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రకటించాలని సవాల్ విసిరారు.రైతులపై ప్రభావం చూపే నిర్ణయాల విషయంలో నియంత్రణ మండలి ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని ఆమె కోరారు. రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ విచారణలు నిర్వహించి రైతుల అభిప్రాయాలను తెలుసుకోవాలని సూచించారు. రైతులకు నష్టం కలిగించే విధానాలకు అనుమతి ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు.ఈ అంశంపై ఇప్పటికే తెలంగాణ జాగృతి తరఫున న్యాయపోరాటం ప్రారంభించినట్లు కవిత వెల్లడించారు. అవసరమైతే ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించి రైతు డిస్కం అమలును అడ్డుకుంటామని స్పష్టం చేశారు.పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులను వేగవంతం చేయాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు దసరా నాటికి ప్రారంభించకపోతే పాదయాత్ర చేపడతానని హెచ్చరించారు.అదేవిధంగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి చేతి తొలగింపు ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన కవిత, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని కోరారు. చిన్నారి భవిష్యత్తు కోసం ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో విద్య, వైద్యం, రైతు సంక్షేమం వంటి అంశాలపై ప్రభుత్వం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కవిత సూచించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి