బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

రేషన్ బియ్యం మాయమైంది నిజం.. డబ్బులు కట్టింది వాస్తవం..

రేషన్ బియ్యం మాయమైంది నిజం.. డబ్బులు కట్టింది వాస్తవం..

“రేషన్ బియ్యం మాయమైంది నిజం.. డబ్బులు కట్టింది వాస్తవం.. ఇంట్లో ఆడవాళ్ల పేరుతో గిడ్డంగి పెట్టిందెవరు?” అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన వారిని మీరు తిట్టలేదా? అని ఆయన విమర్శలు గుప్పించారు. మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన పవన్, వైకాపా నేత పేర్ని నాని పై కూడా విమర్శలు చేశారు. “పేర్ని నాని చేసిన తప్పులే ఆయన కుటుంబాన్ని వీధిలోకి తీసుకువచ్చాయి. అప్పుడు బూతులు తిట్టి, ఇప్పుడు నీతులు చెప్పడం ఎలా?” అని పవన్ నిలదీశారు.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యానిస్తూ, గత ప్రభుత్వం కన్నా ఈ కూటమి ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తోందని చెప్పారు. “అడ్డగోలు నిర్ణయాలపై అధికారులు కూడా స్పందించలేక పోతున్నారు. ప్రభుత్వ వ్యవస్థలు పూర్తిగా విఫలమయ్యాయి. పనిముట్టి సంస్కృతి లేకుండా పోయింది. గత ప్రభుత్వంతో, ఈ ప్రభుత్వంతో పోల్చండి. రెండు పాలనల మధ్య ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంది” అని పవన్ వ్యాఖ్యానించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల కోసం పనిచేయాలనేది తాము చెబుతున్నా అని, ఇప్పటివరకు ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టామన్నారు. ఇక నుంచి ప్రతి గ్రామంలోకి వెళ్లి క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. “మేము ఎన్డీఏ ఆధ్వర్యంలో బాధ్యతతో పనిచేస్తున్నాం. పదవులు అనుభవించడం కాదు, బాధ్యతతో పనిచేస్తాం” అని పవన్ కల్యాణ్ చెప్పారు. ప్రధాని మోదీ యొక్క తాగునీరు, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను సాధించేందుకు ప్రత్యేకంగా దృష్టి పెట్టామని ఆయన వివరించారు.