బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

స్త్రీ విద్య కోసం తన జీవితాన్ని అర్పించిన మహనీయురాలు

స్త్రీ విద్య కోసం తన జీవితాన్ని అర్పించిన మహనీయురాలు

సావిత్రీబాయి ఫూలే జయంతి: కేటీఆర్‌ నివాళి, బీఆర్‌ఎస్‌ శ్రేణులకు పిలుపు

హైదరాబాద్: స్త్రీ విద్య కోసం తన జీవితాన్ని అర్పించిన మహనీయురాలు సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) ఘనంగా నివాళులర్పించారు. “ఆడబిడ్డల చదువుకై అక్షర సమరం చేసిన చదువుల తల్లి సావిత్రీబాయి ఫూలే, సామాజిక అసమానతలపై తిరుగుబాటు చేసిన పోరాటశీలి” అని ఆమెను కొనియాడారు. ఈ సందర్భంగా సావిత్రీబాయికి ఎక్స్ వేదికగా పుష్పాంజలి ఘటించారు.

నిరంకుశ పాలనపై పోరాటం కొనసాగిద్దాం

తుగ్లక్‌ విధానాలు, నిరంకుశ పాలన, కాంగ్రెస్‌ పార్టీ హామీలను విస్మరించిన తీరు తదితర అంశాలపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు మరింత శక్తివంతమైన పోరాటం చేయాలని కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా గులాబీ శ్రేణులకు సందేశం అందజేస్తూ, “కాంగ్రెసు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పోరాడడం కొనసాగిద్దాం” అని పిలుపునిచ్చారు.

గత ఏడాది పోరాటాలకు ప్రశంస

“గత ఏడాది కాలంగా కాంగ్రెస్‌ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గులాబీ సైనికులు చేసిన కదనోత్సాహం ప్రశంసనీయం. ప్రతి ఒక్కరి పోరాట స్ఫూర్తికి శిరస్సు వంచి సలాం చేస్తున్నా” అని కేటీఆర్‌ అన్నారు. క్షేత్రస్థాయిలో గులాబీ శ్రేణులు చూపిన నిబద్ధత రాష్ట్ర నాయకత్వంలో నూతన ఉత్తేజాన్ని నింపిందని తెలిపారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అన్ని వర్గాల పక్షాన బీఆర్‌ఎస్‌ పోరాటం

తుగ్లక్‌ విధానాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు, నేతన్నలు, బడుగు బలహీనవర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పక్షాన బీఆర్‌ఎస్‌ శ్రేణులు అలుపెరగని పోరాటం చేస్తున్నారని కేటీఆర్‌ అభినందించారు. నిరుద్యోగుల హక్కుల కోసం కాంగ్రెస్‌ను నిలదీసి, వారి ఆరు గ్యారంటీల మాయాజాలాన్ని ప్రజల ముందు విప్పి చూపిన పార్టీ శ్రేణులను ఆయన ప్రశంసించారు.

గద్దెదింపే వరకు పోరాటం

“గెలుపు-ఓటములతో సంబంధం లేకుండా, కాంగ్రెస్‌ మోసపూరిత ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు నిరంతరం పోరాటం కొనసాగిద్దాం. ఇది ప్రజాస్వామ్య సాధనగా మన సమర్పణ భావనకు నిదర్శనం అవుతుంది” అని కేటీఆర్‌ పేర్కొన్నారు.