బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

తెలంగాణ భవన్‌లో సావిత్రి బాయి ఫూలే జయంతి నిర్వహణ

తెలంగాణ భవన్‌లో సావిత్రి బాయి ఫూలే జయంతి నిర్వహణ

Savitri Bai Phule Jayanti organized in Telangana Bhavan

|| Savitri Bai Phule Jayanti organized in Telangana Bhavan ||

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో సావిత్రి బాయి ఫూలే (Savitribai Phule) జయంతి కార్యక్రమం ఈ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, సావిత్రి బాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఆమెకు ఘన నివాళులు అర్పించారు. ఆమె సేవలను స్మరించుకునే కార్యక్రమంలో శాసన మండలిలో ప్రతిపక్ష నేత ఎం.ఎల్.సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తుల ఉమ, దేవీప్రసాద్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

సావిత్రి బాయి ఫూలే మహిళా విద్యా కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వారిగా గుర్తించారు. ఆమె ఎన్నో ప్రతికూల పరిస్థితులలో కూడా మహిళలకు విద్య అందించేందుకు కృషి చేశారు. సావిత్రి బాయి స్వయంగా సొంత వనరులతో విద్యాలయాలను స్థాపించి, భారత దేశం లో మొదటి మహిళా టీచర్‌గా వెలిగారు.

ఎంఎల్‌సీ మధుసూదనాచారి మాట్లాడుతూ, “ఫూలే దంపతుల స్ఫూర్తితో కేసీఆర్ గారు వందలాది గురుకులాలను స్థాపించారు. వారు సమాజంలో ప్రతికూలతలను ఎదుర్కొని బడుగు, బలహీన వర్గాలకు విద్య నందించారు. వారి సేవలు దేశం వేర్వేరు రంగాల్లో అభివృద్ధికి ఎంతో అవసరమని, వారిని భారతరత్నతో గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.”

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, “సావిత్రి బాయి ఫూలే దంపతులు రిజర్వేషన్ల కోసం, సామాజిక న్యాయం కోసం, మహిళలకు విద్యావకాశాల కోసం విశేషంగా కృషి చేశారు. బీసీ గణన దేశవ్యాప్తంగా చేపట్టాలి, అలాగే రాష్ట్రంలో బీసీలకు నాలుగు మంత్రి పదవులు ఇవ్వాలని కోరారు.”

తుల ఉమ మాట్లాడుతూ, “సావిత్రి బాయి స్ఫూర్తి ద్వారా మహిళలు రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఆమె 33 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడిన యోధురాలు. కాంగ్రెస్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ అమలు చేయాల్సిందిగా అన్నారు.”