బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

సుప్రీం కోర్టులో మోహన్ బాబుకు తాత్కాలిక ఊరట

సుప్రీం కోర్టులో మోహన్ బాబుకు తాత్కాలిక ఊరట

Supreme Court granted temporary relief to actor Mohan Babu

సుప్రీం కోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు తాత్కాలిక ఊరట

సినీ నటుడు మోహన్ బాబుపై జర్నలిస్ట్‌కు దాడి చేసిన కేసులో సుప్రీం కోర్టు ఆయనకు స్వల్ప ఊరట కల్పించింది. తదుపరి విచారణ వరకు మోహన్ బాబుపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసింది.

కేసు వాయిదా
సుప్రీం కోర్టు ఈ కేసును నాలుగు వారాలకు వాయిదా వేసింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని, ఇందుకు సంబంధించి ప్రతివాదులకు నోటీసులు పంపించింది.

సుప్రీం ధర్మాసనం ప్రశ్నలు
“ఇంట్లోకి వచ్చినంత మాత్రాన జర్నలిస్ట్‌పై దాడి చేస్తారా?” అని ధర్మాసనం ప్రశ్నించింది. “ఈ కేసులో మీకేమి కావాలి? నష్టపరిహారం లేదా జైలుశిక్ష?” అని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. కౌంటర్లో అన్ని వివరాలు స్పష్టంగా పొందుపరచాలని ఆదేశించింది. తదుపరి విచారణలో తగిన తీర్పు ఇస్తామని ధర్మాసనం పేర్కొంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మోహన్ బాబు వాదనలు
సినీ నటుడు మోహన్ బాబు తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. “నాకు 76 ఏళ్ల వయసు ఉంది. ఈ ఘటన కావాలని జరగలేదు. నా కొడుకుతో జరిగిన గొడవ సమయంలో ఆవేశంలో జరిగిన చర్య మాత్రమే. జర్నలిస్ట్‌పై దాడి చేసినందుకు ఇప్పటికే బహిరంగంగా క్షమాపణ చెప్పాను. నష్టపరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాను,” అని మోహన్ బాబు తెలిపారు.

జర్నలిస్ట్ ఆరోపణలు
మరోవైపు, బాధిత జర్నలిస్ట్ తన ఆరోపణలను కోర్టు ముందుంచారు. “దాడి కారణంగా ఐదు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందాను. నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. నెల రోజులుగా పైపు ద్వారానే ఆహారం తీసుకుంటున్నాను. మోహన్ బాబు నాపై దాడి చేయడంతో పాటు కించపరిచారు,” అని ఆయన పేర్కొన్నారు.