బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

రాజీనామా అంశంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

రాజీనామా అంశంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Interesting comments of Chandrababu on resignation

విజయసాయి రాజీనామా అంశంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

అమరావతి: వైసీపీ కేంద్ర కమిటీ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజీనామా వార్తపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దావోస్ పర్యటన వివరాలు మీడియాతో పంచుకున్న అనంతరం విజయసాయి రాజీనామా అంశంపై స్పందించారు.

“పార్టీ అంతర్గత వ్యవహారమే”:
విజయసాయి రాజీనామా గురించి మాట్లాడుతూ చంద్రబాబు, “ఇది వారి పార్టీ అంతర్గత వ్యవహారమని, పార్టీపై నమ్మకం ఉంటే వారు పార్టీలో ఉంటారు, లేకుంటే వెళ్లిపోతారు,” అని వ్యాఖ్యానించారు. “వైసీపీ పరిస్థితిని ఇది ప్రతిబింబిస్తుందని” కూడా చెప్పారు.

విజయసాయి ప్రకటన:
వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తన పదవికి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. శనివారం రోజున తన రాజీనామా పత్రాన్ని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కడ్‌కు అందజేశారు. అలాగే, రాజకీయాలకు శాశ్వతంగా గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

“ఇది నా వ్యక్తిగత నిర్ణయం”:
తన రాజీనామా గురించి విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, “ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని, ఎలాంటి ఒత్తిళ్లు లేవని, ఎవరి ప్రభావం లేదని” స్పష్టం చేశారు. వేరే రాజకీయ పార్టీలో చేరడం లేదని, డబ్బు లేదా ఇతర ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

రాజకీయ పరిణామాలు సహజమే:
ఇలాంటి పరిణామాలు రాజకీయాల్లో సహజమేనని చంద్రబాబు అన్నారు. విజయసాయి రాజీనామా వైసీపీ అంతర్గత సమస్యలను బయట పెట్టే విధంగా ఉంది. ప్రస్తుతం ఇది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.