బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు అరాచక పాలనపై తీవ్ర విమర్శలు

చంద్రబాబు అరాచక పాలనపై తీవ్ర విమర్శలు

Severe criticism of Chandrababu's anarchic regime

చంద్రబాబు అరాచక పాలనపై తీవ్ర విమర్శలు: వైసీపీ నేత గోరెంట్ల మాధవ్

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పాలనపై వైసీపీ మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ (Gorantla Madhav) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పాలన అరాచకంగా సాగుతోందని, ప్రజల జీవితాలు ప్రమాదంలో పడుతున్నాయన్నారు.

చంద్రబాబు పాలనకు గోరెంట్ల తీవ్ర వ్యాఖ్యలు:
గోరెంట్ల మాధవ్ మాట్లాడుతూ, “వైఎస్ జగన్ హాయంలో పాలన మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగితే, చంద్రబాబు పాలనలో మూడు రేప్‌లు, ఆరు హత్యల లాంటి దారుణాలు జరుగుతున్నాయి,” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమం కోసం నోటిఫికేషన్లు ఇవ్వమంటే, చంద్రబాబు హత్యా రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారని మండిపడ్డారు.

కురుమ వీరన్న హత్య దారుణం:
ఆరుగురు పిల్లలున్న కురుమ వీరన్న హత్యని గోరెంట్ల తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దారుణాలు దారి తప్పిన పాలనకు నిదర్శనమని, చంద్రబాబు హత్యా రాజకీయాలను ప్రోత్సహించకుండా వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

వైసీపీ శ్రేణులకు పిలుపు:
వైసీపీ శ్రేణులు ప్రజల ఆత్మరక్షణ కోసం సమయస్ఫూర్తిగా వ్యవహరించాలని గోరెంట్ల మాధవ్ పిలుపునిచ్చారు. “మనకు తగలిస్తే మౌనంగా ఉండకుండా దాడులకు సమాధానమివ్వాల్సి వస్తుంది,” అని వ్యాఖ్యానించారు. కూటమి పార్టీల దౌర్జన్యాలకు ప్రజలు తగిన సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

పరామర్శతో కుటుంబానికి భరోసా:
గోరెంట్ల మాధవ్ కురుమ వీరన్న కుటుంబాన్ని పరామర్శించి, బాధిత కుటుంబానికి వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. “ప్రజల న్యాయం కోసం వైసీపీ కట్టుబడి ఉంటుంది,” అంటూ ధైర్యం చెప్పారు.

చంద్రబాబుకు సూచన:
గోరెంట్ల మాధవ్ చంద్రబాబును ఉద్దేశిస్తూ, హత్యా రాజకీయాలకు తక్షణమే తెరదించాలని, ప్రజల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. “ప్రజల జీవితాలతో చెలగాటం ఆపకపోతే, ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారు,” అని హెచ్చరించారు.