బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

బాలకృష్ణకు అభినందనలు తెలిపిన డిప్యూటీ సీఎం

బాలకృష్ణకు అభినందనలు తెలిపిన డిప్యూటీ సీఎం

Deputy CM Pawan Kalyan congratulated Balakrishna

రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. సినీ రంగం, సేవా రంగంలో విశేషమైన సేవలను గుర్తించి ఈ పురస్కారాలను అందజేస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించారు. నటుడిగా, నిర్మాతగా మాత్రమే కాకుండా సమాజ సేవలోనూ అత్యుత్తమ కృషి చేసినందుకు గానూ ఈ గౌరవం వరించింది.

బాలకృష్ణకు అవార్డు ప్రకటించగానే సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అభినందనలు తెలిపారు. పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ వేదికగా,
“ఐదు దశాబ్దాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన బాలకృష్ణ గారికి పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం చాలా సంతోషకరం. వెండితెరపై ఎన్నో విభిన్నమైన పాత్రల ద్వారా అభిమానులను అలరించారు. హిందూపురం ఎమ్మెల్యేగానే కాకుండా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా కూడా విశేషమైన సేవలందించారు. ఆయనకు నా హృదయపూర్వక అభినందనలు. పద్మ పురస్కారాలకు ఎంపికైన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్