Breaking News

Lokesh you are big pappu sudda : Ambati Rambabu

లోకేష్ నువ్వు పెద్ద పప్పు సుద్ద : అంబటి రాంబాబు

లోకేష్ పప్పు సుద్ద: అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

అమరావతి:
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోకేష్‌ మాయల మాటలు, అసత్య ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, “మీ తండ్రి చంద్రబాబునాయుడు ఉన్నందువల్లే నీకు గౌరవం ఉంది, లేకపోతే నువ్వు పెద్ద పప్పు సుద్దవే” అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అమర్నాథ్‌ను అవమానించడంపై ఆగ్రహం:
లోకేష్, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్‌ను కోడిగుడ్డు అని ఎద్దేవా చేయడాన్ని అంబటి తీవ్రంగా ఖండించారు. “గుడివాడ అమర్నాథ్ ఓ మాజీ మంత్రి కొడుకు. ఆయన తండ్రి లేని పరిస్థితుల్లోనూ తన కష్టం, ప్రతిభతో గౌరవం పొందారు. కానీ నువ్వు చంద్రబాబు లేకుండా ఏమీ కాకపోతావు” అంటూ లోకేష్‌పై విమర్శలు గుప్పించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

టీడీపీ హామీలపై ప్రశ్నలు:
అంబటి మాట్లాడుతూ, చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయారని ధ్వజమెత్తారు. “జగన్ అప్పట్లోనే బాబు హామీలు అమలు చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు. ఇప్పుడు చంద్రబాబు తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు జగన్ ఆర్థిక విధ్వంసం చేశాడని ఆరోపించడం సిగ్గుచేటు” అన్నారు.

వైసీపీ ప్రభుత్వ విజయాలు:
అంబటి చెప్పిన ప్రకారం, వైసీపీ హయాంలో మొత్తం అప్పు రూ.6.46 లక్షల కోట్లు మాత్రమేనని, ఇది చంద్రబాబు చెప్పిన రూ.14 లక్షల కోట్ల కంటే సగమేనని వివరించారు. “జగన్ హయాంలో రాష్ట్రం ఆర్థికంగా మెరుగ్గానే ఉంది. ఇక పెట్టుబడుల విషయంలోనూ జగన్ సర్కారు గణనీయమైన విజయాలు సాధించింది. టెక్ మహీంద్రా, అదానీ, అరబిందో వంటి పెద్ద కంపెనీలతో రూ.1.26 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది” అన్నారు.

చంద్రబాబు దావోస్ పర్యటనపై విమర్శలు:
అంబటి, చంద్రబాబు దావోస్ పర్యటనను ఉద్దేశించి తీవ్రంగా విమర్శించారు. “కొడుకుతో, అధికారులతో కలిసి పెద్ద ఆర్భాటంగా వెళ్లిన చంద్రబాబు ఒప్పందాలు ఏవీ కుదరచుకోలేక ఎమోయూ లేకుండా తిరిగొచ్చారు. దావోస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మిధ్య ప్రచారం చేయడం సిగ్గుచేటు” అన్నారు.

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

లోకేష్‌కి గట్టిగానే హెచ్చరిక:
“మీ తండ్రి మీద ఆధారపడుతూ వాగడానికే పరిమితమైన లోకేష్ పెద్ద పప్పు సుద్ద. ప్రజల సమస్యలు, అభివృద్ధి లక్ష్యాల గురించి ఆయన ఏం తెలుసు? మభ్యపెట్టే రాజకీయాలు మానుకొని నిజాలను తెలుసుకోవాలి” అని అంబటి రాంబాబు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *