బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

రాష్ట్రవ్యాప్తంగా సంబరాలకు టీపీసీసీ పిలుపు

రాష్ట్రవ్యాప్తంగా సంబరాలకు టీపీసీసీ పిలుపు

తెలంగాణలో కాంగ్రెస్ సంచలన నిర్ణయాలు – రాష్ట్రవ్యాప్తంగా సంబరాలకు టీపీసీసీ పిలుపు

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో కులగణన (Caste Census), ఎస్సీ వర్గీకరణ (SC Classification) పై తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాలను రాష్ట్రవ్యాప్తంగా జయప్రదం చేయాలని టీపీసీసీ చీఫ్ బీ. మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) పిలుపునిచ్చారు.

బీసీలు, ఎస్సీల కోసం కాంగ్రెస్ కీలక నిర్ణయాలు

గత ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకురావడం చారిత్రక ఘట్టమని ఆయన అన్నారు.
సమాజంలో ప్రధాన వర్గాలైన బీసీలు, ఎస్సీలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ నిర్ణయాలకు కార్యాచరణ సిద్ధమైందని తెలిపారు.

సీఎం రేవంత్, మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు

ఈ చారిత్రాత్మక నిర్ణయాల అమలుకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉప సంఘం చైర్మన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో-చైర్మన్ దామోదర్ రాజనర్సింహ, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవిలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

గ్రామాల్లో, మండలాల్లో భారీ సంబరాలకు పిలుపు

ఈ నిర్ణయాలను బీసీ, ఎస్సీ వర్గాలకు పెద్ద ఎత్తున తెలియజేయాలనే ఉద్దేశంతో గ్రామాలు, మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు భారీ సంబరాలు నిర్వహించాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సబ్ కమిటీ ప్రత్యేక ప్రజెంటేషన్

ఇక ఈ రోజు మధ్యాహ్నం అసెంబ్లీ కమిటీ హాలులో బీసీ కులగణన (Caste Census)పై సబ్ కమిటీ చైర్మన్, నీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
ఈ కార్యక్రమానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, కో-చైర్మన్ దామోదర్ రాజనర్సింహ, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క సహా ఇతర మంత్రులు హాజరుకానున్నారు.

కులగణన, ఎస్సీ వర్గీకరణ అమలుతో బీసీ, ఎస్సీ వర్గాలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.