Breaking News

Yadav community protest against BJP leadership

బీజేపీ నాయకత్వంపై యాదవ సంఘం తీవ్ర నిరసన

నాంపల్లిలో బీజేపీ ఆఫీసు ముట్టడించిన యాదవ సంఘం

హైదరాబాద్: నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం వద్ద బుధవారం ఉదయం యాదవ సంఘం సభ్యులు ఆందోళనకు దిగారు. బీజేపీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు.

యాదవులకు అన్యాయం – ఉద్యమించిన సంఘం సభ్యులు

ఇటీవల బీజేపీ ప్రకటించిన జిల్లా అధ్యక్షుల జాబితాలో యాదవులకు ఒక్క పదవీ కూడా కేటాయించలేదని ఆగ్రహంతో వారు ఆందోళన చేపట్టారు. పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, పదవులు కేటాయించకుండా విస్మరించడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత

గత ఎన్నికల్లోనూ నిర్లక్ష్యం

పార్టీ గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా యాదవులకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, టికెట్లు కేటాయించకపోవడం పట్ల కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో యాదవ సంఘం సభ్యులు పెద్ద ఎత్తున బీజేపీ ఆఫీసును ముట్టడించి నిరసన తెలిపారు.

పార్టీ హైకమాండ్‌కు గట్టి సందేశం

ఆందోళన నేపథ్యంలో బీజేపీ నేతలు యాదవ సంఘం నాయకులతో చర్చలు జరిపే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో యాదవులకు సముచిత స్థానం కల్పించకపోతే, తమ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని యాదవ సంఘం నేతలు హెచ్చరించారు.

కేరళ ఎన్నికల్లో పాల్గొననున్న ఉత్తమ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *