బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

సమాచార హక్కు చట్టం పై రైతులకు అవగాహన సదస్సు

సమాచార హక్కు చట్టం పై రైతులకు అవగాహన సదస్సు

సమాచార హక్కు చట్టం పై రైతులకు అవగాహన సదస్సు

ఎ. కొండూరు ఫిబ్రవరి 7 ( నేటి తెలుగు పత్రిక)

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

రైతు సేవ కేంద్రం ఎ.కొండూరు లో సమాచార హక్కు చట్టం పై రైతులకు అవగాహన  సదస్సు నుశుక్రవారంమండల వ్యవసాయశాఖాధికారి షేక్.టిప్పుసుల్తాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ-  ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీతనం కోసం ఆర్‌టీఐ ఎంతో దోహదపడుతోందని అన్నారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాలు అవగాహనలు సమాచార హక్కును విలువైన పౌర హక్కుగా గుర్తించిన నేపథ్యంలో సమాచార హక్కు చట్టాన్ని మే 11, 2005 లోక్ సభ లో ఆమోదించారని తెలిపారు. ఈ చట్టంలో పేర్కొనబడిన ప్రతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక పౌర సమాచార అధికారి ఈ చట్టం పేర్కొన్న విధులను నిర్వహిస్తూ ఉంటారని ఈ చట్టంలో పేర్కొనబడిన ప్రకారం రికార్డులు దస్తావేజులు మెమోలు ఈ-మెయిల్ అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్క్యులర్లు, ఉత్తర్వులు, రిజిస్టర్లు, కాంట్రాక్టులు, నివేదిక నమూనాలు, క్రోడీకరించబడిన సమాచార గ్రంథం లిఖితపూర్వకంగా లేదా ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిక్షిప్తం చేయబడి ప్రతి అంశం సమాచార అధికారి సెక్షన్ – 8 లో ఇచ్చిన నిబంధనలకు లోబడి సమాచారం కాపీలను అర్జీదారునికి అందజేయాలని సూచించారు. ప్రజలు కోరిన సమాచారాన్ని సంబంధిత అధికారులు 30. రోజుల్లోపు అందించాలని  తెలిపారు. పౌర సమాచార అధికారులు సకాలంలో సమాచారం ఇవ్వకుంటే చట్టం ప్రకారం అప్పీలేట్‌ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాలన సవ్యంగా ఉండాలన్నా, సత్యంకోసం, స్వేచ్ఛకోసం, నీతికోసం, ప్రజా శ్రేయస్సు కోసం, సంక్షేమ అభివృద్ధి ఫలాల కోసం ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని ఏవో షేక్ టిప్పు సుల్తాన్ అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ అభివృద్ధి పథకాలు క్షేత్రస్థాయిలో సమగ్రంగా అమలు కావడానికి సమాచార హక్కు చట్టం వారధిగా నిలుస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్.యస్.కె. సిబ్బంది రైతులు పాల్గొన్నారు.