బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

బీసీల కోసం కార్యాచరణ సిద్ధం – కేటీఆర్

బీసీల కోసం కార్యాచరణ సిద్ధం – కేటీఆర్

People should take notice of Congress' fraudulent rule: KTR

బీసీలకు అన్యాయం.. కాంగ్రెస్‌ను నిలదీయడానికి బీఆర్ఎస్ కార్యాచరణ

హైదరాబాద్: బీసీ వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ క్షేత్రస్థాయిలో కార్యాచరణ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల్లో బీసీలకు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకపోవడంపై బీసీ వర్గాలను మరింత చైతన్యం చేయాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తున్నది.

ఈ నేపథ్యంలో ఆదివారం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) బీసీ వర్గానికి చెందిన నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.

కులగణనలో బీసీలకు అన్యాయం

కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన (Caste Census) పేరుతో బీసీల సంఖ్యను కావాలని తక్కువగా చూపించిందని బీసీ నేతలు తీవ్ర అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రభుత్వంపై ఎలా పోరాటం చేయాలి? అనే దిశగా ఈ సమావేశంలో కీలక చర్చలు జరగనున్నాయి.

కామారెడ్డి డిక్లరేషన్ అమలుచేయని కాంగ్రెస్

కామారెడ్డి డిక్లరేషన్ (Kamareddy Declaration) పేరిట ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎన్నో హామీలు ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు వాటిలో ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక ప్రణాళిక రూపొందించనుంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ పాలనలో బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత

బీసీలకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాలు, రాజకీయ అవకాశాలు, పార్లమెంట్ & అసెంబ్లీ సీట్ల కేటాయింపు తదితర అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది.

బీసీల కోసం కార్యాచరణ సిద్ధం

బీసీ వర్గాలకు బీఆర్ఎస్ అండగా నిలబడేందుకు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయేందుకు తీసుకోవాల్సిన కార్యాచరణపై కేటీఆర్ స్పష్టమైన మార్గదర్శనం చేయనున్నట్లు సమాచారం.

ఈ సమావేశానికి బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరికీ ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌పై పోరుకు బీఆర్ఎస్ బీసీ నేతలు ఏ విధంగా సమాయత్తమవుతారు? అనే దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.