|| Electricity department fully prepared for summer – Deputy CM Batti Vikramarka ||
📍 హైదరాబాద్: రాబోయే వేసవిలో విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో ఎస్పీడీసీఎల్ (SPDCL) పరిధిలోని విద్యుత్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
🔹 విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూడాలి
📌 గత వేసవిలో వచ్చిన విద్యుత్ డిమాండ్, రానున్న వేసవికి అవసరమైన ప్రణాళికలపై సమీక్ష
📌 ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా కోసం అధికారులు అప్రమత్తంగా ఉండాలి
📌 వినియోగదారులకు అవగాహన కల్పించాలి, క్షేత్ర స్థాయిలో తగిన ఏర్పాట్లు చేయాలి
🔹 సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
📌 ఎమర్జెన్సీ విద్యుత్ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని ఆదేశం
📌 సబ్ స్టేషన్ల నిర్మాణం మార్చి 1 నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి
📌 1912 డయల్ సర్వీస్‌ను మరింత పటిష్టంగా చేసి వినియోగదారులకు సమాచారం అందించాలి
📌 సాంకేతిక అభివృద్ధికి నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధం
🔹 విద్యుత్ శాఖలో అవార్డుల ప్రణాళిక
📌 అత్యుత్తమ సేవలు అందించే అధికారులకు ప్రత్యేక అవార్డులు ఇవ్వాలని డిప్యూటీ సీఎం సూచన
📌 వరదల సమయంలో అహర్నిశలు శ్రమించిన సిబ్బందిని గుర్తించి ప్రోత్సహించాలి
📢 ఈ వేసవిలో ఎలాంటి విద్యుత్ సమస్యలు లేకుండా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు రూపొందించినట్లు స్పష్టం చేసారు! 🔋⚡
