Breaking News

If Pharma City is in Hyderabad, why Dharna in Kodangal?

ఫార్మా సిటీ హైదరాబాద్లో ఉంటే, ధర్నా కొడంగల్లో ఎందుకు?

బీఆర్ఎస్ నేతలపై మంత్రి జూపల్లి ఫైర్🔥

📍 హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao) లపై రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మంగళవారం సచివాలయంలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించిన ఆయన పదేళ్ల బీఆర్ఎస్ పాలన ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని ధ్వజమెత్తారు.

🔹 బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు

📌 రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు – అన్ని వర్గాలను సమస్యల ముంపులోకి నెట్టారని మండిపాటు
📌 పదేళ్ల పాటు పాలనలో ఉన్నా, కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వలేకపోయారని ఎద్దేవా
📌 విద్యా, వైద్య రంగాలను నిర్వీర్యం చేసారని ఆగ్రహం
📌 ఏ దిశలోనూ అభివృద్ధి జరగలేదని, అవినీతి, అక్రమాలే చేశారని ఆరోపణ

🔹 ఫార్మా సిటీ హైదరాబాద్లో ఉంటే, ధర్నా కొడంగల్లో ఎందుకు?

📌 కేటీఆర్ ధర్నా అసలు ఎందుకు చేశారో ఆయనకైనా తెలుసా? అని మంత్రి జూపల్లి ప్రశ్న
📌 పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అభివృద్ధికి ఏమి చేసిందని నిలదీత
📌 తాము అధికారంలోకి వచ్చినప్పుడే కొంత ఆర్థిక ఇబ్బంది, కానీ ఇప్పుడు స్థిరంగా అభివృద్ధి బాటలోకి వెళ్తున్నాం అని స్పష్టం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

🔹 కేటీఆర్ ఆరోపణలకు కౌంటర్

📌 సోమవారం కొడంగల్ పర్యటనలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టిన మంత్రి
📌 రేవంత్ రెడ్డి ప్రజల కోసమే కాదు, అన్నదమ్ములు, అదానీల కోసమే పనిచేస్తున్నారని చేసిన వ్యాఖ్యలు అసత్యం
📌 అవాస్తవ ఆరోపణలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపాటు

📢 బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి శూన్యమని, నేరుగా ప్రజలు కోపంతో కాంగ్రెస్ ప్రభుత్వం వైపుకు మొగ్గుచూపారని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. 🚀

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *