Breaking News

"If a bag of rice is cooked for the western race, there will be leftovers" – CM Revanth

“వెలమ జాతికి సంచి బియ్యం వండితే మిగులుతుంది” – సీఎం రేవంత్

📍 హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కులగణన (Caste Census) పై గాంధీ భవన్‌లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా కేసీఆర్ కులగణన సర్వేలో పాల్గొనకపోవడంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

👉 “వెలమ జాతికి సంచి బియ్యం వండితే ఇంకా మిగులుతుంది.. అందుకే కేసీఆర్ కులగణనలో పాల్గొనలేదు” అంటూ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
👉 “నేను ఆఖరి రెడ్డి సీఎం అయినా ఫర్వాలేదు. మా నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టేందుకు క్రమశిక్షణ కలిగిన ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నాను” అని స్పష్టం చేశారు.
👉 “కులగణన నా పదవీ కోసం కాదు.. త్యాగానికి సిద్ధంగా ఉన్న కులాల లెక్కలను పక్కాగా తేల్చేందుకు చేశాం” అని వివరించారు.

📌 “ప్రతిపక్షాలు కులగణనను తప్పుపడుతూ అసత్య ప్రచారం చేస్తున్నాయి. కానీ, మా ప్రభుత్వం పారదర్శకంగా సర్వే నిర్వహించింది” అని చెప్పారు.
📌 “కులగణనను తప్పుపడితే నష్టపోయేది బీసీలే” అని హెచ్చరించారు.
📌 “సుప్రీంకోర్టు సైతం అధికారిక లెక్కల ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని చెప్పొచ్చు. కులగణన సర్వే రెండో విడత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి” అని సూచించారు.

2027 నాటికి హైకోర్టు కొత్త భవనాలు పూర్తి.. సీఎం ఎ. రేవంత్ రెడ్డి

👉 “కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఇంటి ముందు మేలుకొలుపు డప్పు కొట్టాలని బీసీ సంఘాలు సిద్ధం కావాలి” అని రేవంత్ పిలుపునిచ్చారు.
👉 “కులగణనపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, వాటిని చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ, అసత్య ప్రచారాన్ని మాత్రం సహించం” అని స్పష్టం చేశారు.
👉 “కేసీఆర్, మోదీ కలిసి కులగణనను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు” అని ఆరోపించారు.

📢 కులగణనపై స్పష్టతనిస్తూ ప్రభుత్వం త్వరలో మరిన్ని వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.

జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.. సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఘన నివాళి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *