బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

వెయ్యి కోట్ల బకాయిలను తీర్చింది కూటమి ప్రభుత్వం

వెయ్యి కోట్ల బకాయిలను తీర్చింది కూటమి ప్రభుత్వం

The coalition government cleared the arrears of a thousand crores

|| The coalition government cleared the arrears of a thousand crores ||: మంత్రి సత్యకుమార్

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాజీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, “వంద ఎలుకలు తిన్న పిల్లి ప్రాయశ్చిత్తం కోసం కాశీ యాత్రకు వెళ్లినట్టుంది వైఎస్ జగన్ వ్యవహారం” అంటూ వ్యాఖ్యానించారు.

“గత వైసీపీ ప్రభుత్వం మందుల సరఫరాదారులకు వెయ్యి కోట్లకుపైగా బకాయిలు పెట్టింది. వైద్య సేవలను తీవ్రంగా దెబ్బతీసింది. కానీ, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే అన్ని బకాయిలను చెల్లించి, మందుల సరఫరాను పునరుద్ధరించింది” అని మంత్రి స్పష్టం చేశారు.

“పేదల ఆరోగ్యంతో ఆడుకున్నది వైసీపీ ప్రభుత్వమే. అవినీతిలో మునిగిపోయి, కమిషన్లకే పరిమితమై, వైద్య రంగాన్ని కుదేలు చేసింది. వైసీపీ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల్లో మందుల కొరత ఏర్పడింది. కానీ, ఇప్పుడు సంక్రమంగా మందుల సరఫరా చేస్తూ, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం” అని సత్యకుమార్ తెలిపారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

“ప్రజారోగ్యం పట్ల వైసీపీకి చిత్తశుద్ధి లేకపోవడంతోనే ప్రజలు వారిని తిరస్కరించారు. అయినప్పటికీ, ఇప్పటికీ జగన్ అసత్య ప్రచారాలు చేస్తూనే ఉన్నారు” అని మంత్రి మండిపడ్డారు. “ఇప్పటికైనా వైసీపీ నేతలు బాధ్యతాయుతంగా నడుచుకోవాలి” అంటూ హితవు పలికారు.