Breaking News

V Hanumantha Rao's criticism of KCR

కేసీఆర్ పై వీ హనుమంతరావు విమర్శలు

|| V Hanumantha Rao’s criticism of KCR || – మేడిగడ్డ బ్యారేజీపై సంచలన వ్యాఖ్యలు

బీఆర్‌ఎస్ (BRS) అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు (V. Hanumantha Rao) తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్ లో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, “కేసీఆర్ అధికారం ఉండగా ప్రగతి భవన్‌ను కట్టించుకొని ప్రజలను లోపలికి రానివ్వలేదు. కానీ, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక దానిని ప్రజాభవన్‌గా మార్చారు” అని గుర్తు చేశారు.

“బీఆర్‌ఎస్ పార్టీలోనే కేసీఆర్ గ్రాఫ్ పడిపోయింది. అధికాశతో పార్టీ పేరు మార్చి ఇతర రాష్ట్రాలకు విస్తరించేందుకు ప్రయత్నించి, తెలంగాణ ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ విస్తరణ కోసం తెలంగాణలో దోచుకున్న వేల కోట్లు ఖర్చు పెట్టారు” అంటూ హనుమంతరావు సంచలన ఆరోపణలు చేశారు.

మేడిగడ్డ బ్యారేజీపై కీలక వ్యాఖ్యలు

మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) కుంగిపోవడానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. “ఈ స్కాంపై కేసు వేసిన సామాజిక కార్యకర్త రాజ లింగమూర్తిని అన్యాయంగా హత్య చేశారు” అని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

అమరావతికి మద్దతు, కానీ విభజన హామీలు నెరవేరాలి: రేణుకా చౌదరి

“ఈ హత్య వెనుక రాజకీయ కుట్రకోణం ఉందని భావిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా, ఇలాంటి రాజకీయ హత్యలను సహించబోము. నిందితులపై కఠిన చర్యలు తప్పవు” అని స్పష్టం చేశారు.

భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి (47) ని బుధవారం రాత్రి 7.15 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది.

“కేసీఆర్ పాలన వల్ల ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. రాజకీయ లబ్ధి కోసం హత్యలు చేయడం క్షమించరాని నేరం. ఇలాంటి ఘటనలను తాము ఉపేక్షించమని” కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు.

కరీంనగర్‌ లయన్స్ క్లబ్ చారిటబుల్ కంటి ఆసుపత్రికి కొత్త ట్రస్ట్ బోర్డు నియామకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *