Breaking News

మీటర్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి.

కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి: కోటగిరి.

సాయిగూడెంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు.

కోదాడ ,ఫిబ్రవరి 17(నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర ప్రభుత్వం మీటర్ రీడర్ కార్మికులకు కనీస వేతనం అమలు చేసి వారికి గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కోటగిరి వెంకట్ నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కోదాడ పట్టణ సిటీయు కార్యాలయంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ నియోజకవర్గ స్థాయి సమావేశం కే భాస్కర్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీటర్ రీడర్స్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని వారన్నారు. నెల అంతా కష్టపడి పనిచేస్తే కుటుంబం గడిచే పరిస్థితి లేదని, యాజమాన్యం కార్మికులను శ్రమ దోపిడికి గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన పాత పెన్షన్ విధానం ఈపీఎఫ్ టు జిపిఎఫ్ ఎందుకు అమలు చేయడం లేదని వారు అన్నారు. పెరుగుతున్న సర్వీసుల కనుగుణంగా ఓ ఎం డి ఎం మరియు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగుల రిక్రూమెంట్ వెంటనే చేయాలని వారన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లు గా విభజించి కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని వారు అన్నారు. సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను పర్మినెంట్ చేయాలని వారన్నారు. ఈ యొక్క సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు చిత్తలూరి నాగేశ్వరరావు సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఎం ముత్యాలు. కోటగిరి భాస్కర్, పి బ్రహ్మం, షేక్ జానీ పాషా, బి రాంబాబు, కే రామారావు, ఎం నాగచారి జే బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.

మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి: రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *