Breaking News

వంద రోజుల ప్రణాళిక అమలు తో నూరుశాతం ఉతీర్ణత సాధించాలి.

విజయవాడ. ఫిబ్రవరి 17 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: పదో తరగతి పరీక్షలకు సంబంధించి వంద రోజుల ప్రణాళిక అమలుతోనూరు శాతం ఫలితాలను సాధిం చి ఉత్తీర్ణ‌త శాతంలో జిల్లా ను అగ్రగామిగా నిలిపేందు కు కృషిచేయాలని, ధైర్యం గా పరీక్షలను ఎదుర్కొని ఉత్తమ ఫలితాలు సాధిం చేలా విద్యార్థుల‌ను స‌న్న‌ ద్ధం చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ ర్ డా. జి.ల‌క్ష్మీశ ఉపాధ్యా యుల‌కు సూచించారు.ప‌దోతరగతి పరీక్షల సమ యం ఆసన్నమవుతున్న తరుణంలో విద్యార్థుల విద్యా బోదనను పరిశీలిం చేందుకు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక సూర్యారావుపేట లోని శ్రీ కర్నాటి రామమో హనరావు నగర పాలక సంస్థ పాఠశాలను, పట మటలోని గోవిందరాజు ధర్మ ఈనాం ట్రస్టు నగర పాలక ఉన్నత పాఠశాలను సందర్శించారు. జిల్లా కలెక్టర్ పాఠశాలను సంద ర్శించిన సమయంలో పదవ తరగతి విద్యార్థు లకు రోజువారి స్లిప్ టెస్టు ను నిర్వ‌హిస్తున్నారు. ఈ ప‌రీక్ష ముగిశాక జిల్లా కలెక్ట ర్ విద్యార్థుల మేధా శక్తిని పరిశీలిస్తూ గణితం, సైన్స్, సోషల్ స్టడీస్ కు సంబం ధించి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాదానా లను రాబట్టారు. ఈ సంద‌ ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడు తూ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల నుండి 11,200, ప్రైవేటు పాఠశా లల నుండి 16,000 మం ది విద్యార్థులు పదవ తర గతి పరీక్షలు రాసేందుకు సన్నద్ధం అవుతున్నారన్నా రు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను చేరేందుకు లోతైన ఆలోచన చేయా ల్సిన అవసరం ఉందన్నా రు. అప్పుడే ఆశించిన ఫలి తాలు పొందగలుగుతార న్నారు. ఇష్టపడి నేర్చుకు న్న విషయ పరిజ్ఞానం ఎప్పటికీ గుర్తుండిపోతుం ద‌న్నారు. ప్రభుత్వ పాఠశా లల్లో చదువుకునే ఎంతో మంది ఉన్నత స్థానాలకు ఎదిగారని అటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని కష్టమైనా ఇష్టపడి చ‌దివి తే స‌బ్జెక్టు అంశాలు గుర్తుం టాయన్నారు. తమ పిల్ల లు త‌మ‌లా కష్టపడకుండా ఉన్నత శిఖ‌రాలు చేరుకో వాలని సమాజంలో మంచి పేరు తెచ్చుకుని స్థిరపడా లనే ఆశతో ఎంతోమంది తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని రెట్టింపు చేసేలా ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యా యులు కృషి చేయాలన్నా రు. విద్యార్థి జీవితాన్ని మలుపు తిప్పేది పదవ తరగతి పరీక్షలేనని ఈ పరీక్ష పాస్ అయితే ఉన్నత చదువులు చదివేందు కు మార్గం సుగమం అవు తుందన్నారు. ఉపాధ్యా యులు ప్రతి విద్యార్థి పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించేందుకు కృషిచే యాలన్నారు. సబ్జెక్టు ఉపాధ్యాయులు అయా సబ్జెక్టు లలో వెనుకబడిన విద్యా ర్థులపై ప్రత్యేక దృష్టిపెట్టి వారికి అర్థమయ్యే రీతిలో బోధించి ధైర్యంగా పరీక్షలను ఎదుర్కొనేందుకు సన్నద్ధం చేయాలన్నారు. పరీక్షలకు హాజరయ్యే పద్ధతి, ప్రశ్నకు సంబంధించి జవాబు వ్రాసే విధానం వంటి విషయాలను విద్యా ర్థులకు సూచించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసు కోవాలన్నారు. పరీక్షలు సమీపిస్తున్న కీలక సమ యంలో ఉపాధ్యాయలు సెలపులు వినియోగించవ ద్దన్నారు. విద్యార్థులకు వచ్చిన ఫలితాలు ఉపా ధ్యాయులపై తల్లిదండ్రుల లో గౌరవం పెంపొందేందుకు దోహద‌పడ‌తాయన్నారు. 10వ తరగతి ఫలితా లలో జిల్లా ను అగ్రగామిగ నిలిపేందుకు కృషి చేయా లని జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశ ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల సందర్శనలో జిల్లా కలెక్టర్ వెంట డిఇవో ఎల్. చంద్రకళ, శ్రీ కర్నాటి రామమోహనరావు నగర పాలక సంస్థ పాఠశాల ప్రధానోపా ధ్యాయులు ఎం సూర్య ప్రభ, గోవిందరాజు ధర్మ, ఈనాం ట్రస్టు ప్రాధానో పాధ్యాయులు మురాల శ్రీనివాసరావు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సాయిగూడెంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు.

మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి: రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *