బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

నగరంలో డిసిల్టింగ్ పనులు నిరంతరాయం గా జరుగుతుండాలి: కమిషనర్ ధ్యానచంద్ర

నగరంలో డిసిల్టింగ్ పనులు నిరంతరాయం గా జరుగుతుండాలి: కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ. ఫిబ్రవరి 18 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: నగరంలో డిసిల్టింగ్ పనులు నిరంతరాయంగా జరుగుతుండాలని విజయ వాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా మధురానగర్, దేవీనగర్, బి ఆర్ టి ఎస్ రోడ్, సింగ్ నగర్, కొత్త రాజరాజేశ్వరి పేట ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ మేరకు కమిష నర్ మాట్లాడుతూ నగరం లో డీసిల్టింగ్ పనులు నిరంతరాయంగా జరుగుతుం డాలని, సైడ్ కాలువల్లో పూడికలు, సిల్ట్ కచ్చితంగా తొలగించాలని అన్నారు. కొత్త రాజరాజేశ్వరి పేటలో నిర్మాణం దశలో ఉన్న అవుట్ఫాల్ డ్రైన్ ను పరిశీలించారు, నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి త్వరలో అందుబాటు లోకి తీసుకురావాలని అన్నారు. మధుర నగర్ లోని రైల్వే అండర్ బ్రిడ్జి పనులను పరిశీలించి, ప్రజ లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల ని అధికారులను ఆదేశించారు. తదుపరి అజిత్ సింగ్ నగర్లో గల అన్నా క్యాంటీన్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, పారిశు ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలని అధికారులను ఆదేశిం చారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ కె. ప్రభుదాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎ. శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రాంబాబు, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్