Breaking News

Rs.2.25 Lakh Cannabis Pattice:

రూ.2.25 లక్షల గంజాయి పట్టివేత:

రూ.2.25 లక్షల గంజాయి పట్టివేత: దుండిగల్ STF టీమ్‌ భారీ ఆపరేషన్

హైదరాబాద్:
రంగారెడ్డి జిల్లా దుండిగల్ ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు గంజాయి విక్రయాలు జరుగుతుండటంపై సమాచారం అందుకున్న ఎస్‌టీఎఫ్ బీ టీమ్ సీఐ సుబాష్‌ నేతృత్వంలో భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం రూ.2.25 లక్షల విలువైన 8.598 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణకు అదనపు నిధుల కోసం కేంద్రాన్ని కలిసిన భట్టి

ముఖ్యమైన వివరాలు:
మొదటి కేసు:
పోచంపల్లి ప్రాంతానికి చెందిన దీపక్ కుమార్, మహ్మద్ షరిష్ ఇస్మాయిల్ అనే ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి 7.460 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
రెండో కేసు:
మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద బీహార్‌కు చెందిన మిలాన్ కుమార్, మనీష్ కుమార్, అఖిలేష్ కుమార్ అనే ముగ్గురి వద్ద 1.138 కేజీల గంజాయిని పట్టుకున్నారు.
ఆపరేషన్‌లో పాల్గొన్న టీమ్‌:
ఈ ఆపరేషన్‌లో ఎస్‌టీఎఫ్ బీ టీమ్‌ సీఐ సుబాష్‌ తోపాటు ఎస్సైలు వెంకటేశ్వర్లు, అఖిల్‌, కానిస్టేబుళ్లు సుధాకర్‌, రవి, మోహన్‌రావు, సుదీప్‌రెడ్డి ముఖ్యపాత్ర పోషించారు.

అభినందనలు:
గంజాయి పట్టివేతలో కీలకంగా వ్యవహరించిన టీమ్‌ను ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వి.బి. కమలాసన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఆర్. కిషన్, ఏఈఎస్ జీవన్ కిరణ్‌లు అభినందించారు.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు

గంజాయి అక్రమరవాణాపై ఎస్‌టీఎఫ్ బలమైన చర్యలు కొనసాగిస్తోందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *