బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

మచిలీపట్నంలో శుభకర ఆయుర్వేద సేవలు 18 ఏళ్లుగా ప్రజలకు నిస్వార్థ వైద్యం: రంగనాధ్

మచిలీపట్నంలో శుభకర ఆయుర్వేద సేవలు 18 ఏళ్లుగా ప్రజలకు నిస్వార్థ వైద్యం: రంగనాధ్

మచిలీపట్నం. ఫిబ్రవరి 18 నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మచిలీపట్నంలో ఆయుర్వే ద వైద్య సేవలకు విశేష స్పందన లభిస్తోందని శుభకర ఆయుర్వేద వైద్యశాల వైద్యుడు రంగనాధ్ తెలిపారు.ఆయుర్వేద వైద్యశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయుర్వేద వైద్యులు రంగనాథ్ మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా నిరంతరంగా ప్రజలకు సేవలందించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రాచీన భారతీయ వైద్య విధాన మైన ఆయుర్వేదాన్ని ఆధు నిక చికిత్సా సదుపాయాల తో కలిపి ప్రజలకు చేరువ చేయడం తమ లక్ష్యమని చెప్పారు. ముఖ్యంగా కేరళ తరహా పంచకర్మ చికిత్సలు, క్షారసూత్ర విధానం ద్వారా మూలవ్యాధి నివారణ, జలూక చికిత్స ద్వారా రక్తశుద్ధి, శిరోధార ద్వారా మానసిక ఒత్తిడి తగ్గింపు వంటి ప్రత్యేక చికిత్సలను అందిస్తున్నామని వివరించారు. దీర్ఘకాలిక నొప్పులు, సంధివాతం, చర్మవ్యాధులు, జీర్ణ సంబంధ సమస్యలకు సహజసిద్ధమైన మందుల తో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామ న్నారు. అవసరమైన అన్ని ఆయుర్వేద ఔషధాలను స్థానికంగానే అందుబాటు లో ఉంచి, తక్కువ ఖర్చు తో నాణ్య మైన సేవలు అందించడం తమ ప్రత్యేకతగా పేర్కొన్నారు. ఇకపై కూడా ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్