బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

బాధ్యతతో పని చేస్తాం: కార్పొరేషన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం.

బాధ్యతతో పని చేస్తాం: కార్పొరేషన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం.

వారంలో ఒక రోజు డివిజన్ లో పర్యటిస్తా.

కరీంనగర్ మేయర్ కోలగాని శ్రీనివాస్.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కరీంనగర్,నేటి తెలుగు పత్రిక : బిజెపి పై నమ్మకంతో కరీంనగర్ నగరపాలక సంస్థ బాధ్యతలను అప్పజెప్పిన పట్టణ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నామని, ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతతో పనిచేస్తామని, డివిజన్ సమస్యల పరిష్కారం కోసం వారంలో ఒక రోజు డివిజన్ లో పర్యటిస్తనని, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని మేయర్ కోలగని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ పట్టణం 66 డివిజన్లో 13.5 లక్షల నిధులతో చేపట్టిన రోడ్డు, డ్రైనేజీ పనులను డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ వంగల పవన్ లతో కలిసి మేయర్ కోలగని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ కోలగని శ్రీనివాస్ మాట్లాడుతూ కరీంనగర్ ప్రజలు తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు.నగర అభివృద్ధి కోసంకరీంనగర్ పట్టణ ప్రముఖులు, ప్రజల సూచనలు, అభిప్రాయాలను, సలహాలను పరిగణలోకి తీసుకొని ముందుకు కొనసాగుతామని తెలిపారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో నగరాన్ని మరింత అభివృద్ధి చేసే ఆలోచనతో ఉన్నామని , గతం కంటే మెరుగైన స్థితిలో కరీంనగర్ పట్టణాన్ని అభివృద్ధి దిశలోకి తీసుకు వెళ్లడానికి శాయశక్తుల కృషి చేస్తామన్నారు. ప్రధానంగా నగరపాలక సంస్థలోని 66 డివిజన్లో మౌలిక వసతులకు పెద్దపీట వేస్తామని,ప్రజలకు రోడ్లు, డ్రైనేజీల సమస్య ల కు విముక్తి కల్పించే లక్ష్యంతో సంకల్పంతో ఉన్నామన్నారు.కార్పొరేషన్ లో విలీనమైన గ్రామాలొ నెలకొన్న సమస్యలపై ప్రధాన దృష్టి సారించి, సాధ్యమైనంతవరకు సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. చెత్త సేకరణ, పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించేలా , రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని ఏ డివిజన్ కు తాగునీటి కొరత రాకుండా చూస్తామన్నారు. నగరపాలక సంస్థలో ప్రజలకు అవసరమయ్యే పనులు త్వరితగతిన వేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సునీల్ రావు , కార్పొరేటర్లు వంగల పవన్ , గుగ్గిలపు రమేష్, సోమిడి వేణు ప్రసాద్, బండ రమణారెడ్డి, కె పీ చంద్ర, శ్రీనివాస్,కార్పొరేటర్ తాటి ప్రభావతి, కన్న కృష్ణ, బిజెపి మీడియా కన్వీనర్ కటకంలోకేష్, నాయకులు వరాల జ్యోతి,సురేష్, కొంపల్లి రామన్,శ్రీనివాస్,లడ్డు ముందడ, తనకు సాయి కృష్ణ , కైలాస నవీన్ తదితరులు పాల్గొన్నారు.