Breaking News

బ్రాహ్మణ సంక్షేమంపై 20 నెలల్లోనే 580 కోట్లు ఖర్చు చేసిన ఘనత మా కూటమి ప్రభుత్వానిది.

విజయవాడ. ఫిబ్రవరి 19 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ కలపటపు బుచ్చి రాంప్రసాద్‌పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆటో నగర్ లోని జిల్లా కార్యాలయం లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి అధికార ప్రతినిధి ఈమని సూర్యనారాయణ మాట్లాడుతూ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కలపటపు బుచ్చిరాంప్రసా ద్‌ను నువ్వు బ్రాహ్మణుడే నా అని పరుష పదజాలం తో నిందించిన వైసీపీ బ్రాహ్మణ నేత జ్వాలాప్రపు శ్రీకాంత్ నువ్వు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చిరించారు. 2024 మా మానిఫెస్టోలో చెప్పిన ప్రకారం బ్రాహ్మణ సంక్షేమా నికి కూటమి ప్రభుత్వం 20 నెలల్లో 580 కోట్లను వెచ్చి స్తే మీ వైసీపీ ప్రభుత్వం 2019-2024 మధ్యలో 5 సంవత్సరాల్లో కేవలం 780 కోట్లు వెచ్చించింద న్నారు, కూటమిప్రభుత్వం పలు జీవోల ద్వారా అర్చ కుల వేతనాల పెంచటం, వేద పండితులకు నిరుద్యో గ భృతి ఇవ్వటం, రాష్ట్రం లోని అన్ని దేవాలయాల్లో బ్రాహ్మణ సభ్యుల్ని నియ మించటం, పలు బ్రాహ్మణ సంక్షేమ కార్యక్రమాలు చేసి మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దా నాల్లో కేవలం 20 నెలల్లో నే మూడొంతులు వాగ్దా నాలు పూర్తిచేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని తెలిపారు. మీరు దేవాదా య ధర్మాదాయ సలహాదా రుగా ఉన్న సమయంలో పలు హిందూ దేవాలయా లపై జరిగిన దాడులు, బ్రాహ్మణ అర్చకులపై జరిగిన దాడులు, బ్రాహ్మ ణ కార్పొరేషన్‌ను నిర్వీ ర్యం చేసిన విధానం, కళ్లుండి చూస్తూ కూడా అడ్డుకోలేని మీరు రాష్ట్రం లో యావత్ బ్రాహ్మణ జాతికి క్షమాపణ చెప్పాలి, బ్రాహ్మణ సంక్షేమంపై మీ, మా ప్రభుత్వంలో ఏం చేశా మో చర్చకు రావాలని సవాల్ విసిరాలు, ఆధారా లతో మేం చర్చకు సిద్ధమ న్నారు. బాహ్మణ కార్పొరేష న్ డైరెక్టర్ పల్లావజ్జుల ఫణికుమార్ మాట్లాడుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ మాజీ సలహాదారు జ్వాలాప్రపు శ్రీకాంత్ తన నాయకుడు జగన్‌మోహన్‌ రెడ్డికి, స్వామివారికి కానీ దేవస్థా నాల్లో కాని పట్టువస్త్రాలు ఇచ్చేటప్పుడు హిందూ సాంప్రదాయం ప్రకారం భార్యతో వచ్చి పట్టు వస్త్రాలివ్వాలని కూడా తన నాయకుడికి చెప్పుకో లేని శ్రీకాంత్ ప్రస్తుతట బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లపై విమర్శిం చడాన్ని రాష్ట్రంలోని బ్రాహ్మణులందరూ అసహ్యించుకుంటున్నా రు. బ్రాహ్మణ కార్పొరేష న్ పథకాలపై మేము చర్చకు సిద్ధమని సవాల్ విసిరిరా రు. బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి గూడూరు శేఖర్ మాట్లాడుతూ జ్వాలాప్రపు శ్రీకాంత్ మీరు స్థాయిని మరిచి మీరు మా పార్టీ అధినేత, కూటమి ప్రభు త్వ నాయకులు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌పై మాట్లాడుతున్నా వు, నీ స్థాయికి మేము చాలు, ముందు నీకు సిగ్గుందా, గత మీ ప్రభుత్వంలో దేవాలయాలపై దాడులు జరిగినప్పుడు మీరెక్కడ దాక్కున్నారు, కార్పొరేషన్ నిధులు రావటం లేదని బ్రాహ్మణ కార్పొరేషన్ దగ్గర 2022-23లో బ్రాహ్మణులు ధర్నా చేస్తే వారిని పోలీసులతో కొట్టించి, పోలీస్ స్టేషన్‌లో బంధించింది నువ్వు కాదా? మీ నాయకుడు ఇంటి దగ్గర తిరుపతి దేవస్థానం సెట్ వేసినప్పు డు ఆ రోజు నీ బ్రాహ్మణ్యం ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. బ్రాహ్మణ సంక్షేమం కొరకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది, మా చైర్మన్ బుచ్చిరాంప్రసా ద్ బ్రాహ్మణ్యానికి ఎటువం టి సమస్యలు వచ్చినా పరిష్కరించే దశలో నిర్వి రామంగా కృషిచేస్తున్నా రు, ఏనాడైనా నువ్వు చేశావా, కాదా? నీకు దమ్ముంటే తిరుపతి కల్తీ లడ్డూ గురించి మాట్లాడా లి, బ్రాహ్మణ క్రెడిట్ సొసై టీకి ఎన్నికలు పెట్టుకుండా ఏకగ్రీవం చేసింది మీరు కాదా, దాని మీద బయట వారు కోర్టుకెళ్లింది నిజం బ్రాహ్మణ సంక్షేమం పై చర్చకు మేం సిద్ధం, నువ్వు సిద్ధమా అని సవాల్ విసిరారు.

కేరళకు కేంద్రం పంపిన జీవో ఉపసంహరించాలి…!

నిబంధ‌న‌ల మేర‌కు జ‌ర్న‌లిస్టుల‌కు అక్రెడిటేష‌న్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *