బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

వైసీపీ అధినేత జగన్ కు, వైసీపీ సభ్యులకు టీడీపీ మంత్రి సవిత హెచ్చరిక…!

వైసీపీ అధినేత జగన్ కు, వైసీపీ సభ్యులకు టీడీపీ మంత్రి సవిత హెచ్చరిక…!

విజయవాడ. సెంట్రల్ ఫిబ్రవరి 20 నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: హిందువుల మనోభావాలు దెబ్బతినేలా శాసనమండ లిలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంకన్న ఫొటోలను సభలో విచ్చలవిడిగా పడేసి అప చారానికి పాల్పడ్డారని, ఆ కలియుగ దైవం ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చ రించారు. తక్షణమే హిందువులకు, ప్రజలకు జగన్, వైసీపీ సభ్యులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో తన ను కలిసిన విలేకరుల తో మంత్రి సవిత విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రి శాసనమండలిలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరు గర్హనీయమన్నారు. కలియుగ దైవం వెంకన్న స్వామి ఫొటోలతో రాజకీ యం చేయడం క్షమించరా ని నేరమన్నారు. తెలుగు జాతి ఇలవేల్పు వెంకటేశ్వ ర స్వామి ఫొటోలతో ఉన్న ప్లకార్డులను మండలిలో ఇష్టారాజ్యంగా పడేసి మహా అపచారానికి పాల్ప డ్డారని ఆగ్రహం వ్యక్తంచేశా రు. జగన్ రెడ్డి సూచన మేరకే తమ రాజకీయాల కోసం శాసన మండలిలో వెంకన్న స్వామి ఫొటోలను వైసీపీ సభ్యులు వాడుకు న్నారని మండిపడ్డారు. వారంతా హిందువుల మనోభావాలు దెబ్బతినే లా వ్యవహరించారని, తక్షణమే హిందూ సమా జానికి జగన్, వైసీపీ ఎమ్మెల్సీలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెంకన్న ఆగ్రహాని కి జగన్ , వైసీపీ సభ్యులు గురికాక తప్పదని మంత్రి సవిత హెచ్చరించారు.

నీచానికి దిగజారిన వైసీపీ
మహిళలన్నా గౌవరం లేదని, ప్రజల పట్ల బాధ్య తలేదని వైసీపీ సభ్యులపై మంత్రి సవిత మండిపడ్డా రు. చివరికి దైవం పట్ల పాపభీతి కూడా లేదన్నా రు. ఎంతో పవిత్రమైన తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసి పాపం మూటకట్టుకున్నారని, ఇదే విషయం సీబీఐ వేసిన సిట్ సైతం స్పష్టం చేసింద ని తెలిపారు. ఈ అంశం నుంచి ప్రజల దృష్టి మర ల్చడానికి, సభలో చర్చల కు ఆటంకం కలిగించడా నికి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి వైసీపీ సభ్యులు రచ్చ చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యలతో పాటు తిరు పతి లడ్డూ అంశంపై నా చర్చకు సిద్ధంగా ఉన్నామ ని ప్రకటించినా వైసీపీ సభ్యులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రజా సమస్య లపై చర్చించకుండా, తమ తప్పులు బయటపడకుం డా వైసీపీ సభ్యులు ఎంత టి నీచానికైనా దిగజారిపో తున్నారని, సభను అడ్డు కుంటున్నారని మండిప డ్డారు. తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం బయటకు రావడంతో జగన్, వైసీపీ సభ్యులు డైవర్షన్ రాజకీ యాలు చేస్తున్నారని, ప్రజలను వారిని పట్టించు కోవడం మానేశారని అన్నారు. 33 ఏళ్ల నుంచి హెరిటేజ్ ప్రజల నమ్మకా న్ని గెలుచుకుని వ్యాపార ప్రస్థానాన్ని ముందుకు సాగిస్తోందన్నారు. హెరిటే జ్ కు, టీటీడీకి ఎటువంటి సంబంధమూ లేదని మంత్రి సవిత తేల్చి చెప్పారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్